దివంగత అందాల అతిలోక సుందరి శ్రీదేవి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. సౌత్ నుంచి ప్రారంభమైన శ్రీదేవి ప్రస్థానం నార్త్ వరకు వెలిగిపోయింది. అసలు శ్రీదేవిని బాలీవుడ్ వాళ్లు అయితే ఓ దేవతలా ఊహించేసుకున్నారు. సౌత్ నుంచి నార్త్‌కు వెళ్లాక అసలు సౌత్ సినిమాలలో నటించేందుకే ఆసక్తి చూపలేదు. ఒకవేళ నటించాలన్న చాలా కండీషన్లతో పాటు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేసేదట.
అదంతా శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయ్యాక చేసిన ఎక్స్‌ట్రాలు అంటారు. అయితే ఇప్పుడు ఆమె పెద్ద కుమార్తె జాన్వీకపూర్ మాత్రం అసలు హీరోయిన్‌గానే స్టార్ స్టేటస్ తెచ్చుకోకుండా నానా కండీషన్లతో ఎక్స్ ట్రాలు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. జాన్వీ సౌత్ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. అయితే ఆమె పెట్టిన కండీషన్ల దెబ్బతోనే టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో బుక్ చేయాలన్న ఆలోచననే విరమించుకున్నారు.
అసలు జాన్వీని మహేష్, విజయ్ దేవరకొండ, బన్నీ సినిమాల్లో హీరోయిన్‌గా బుక్ చేస్తారని ఒక్కటే ప్రచారం జరిగింది. అయితే రెమ్యునరేషన్ విషయంలో ఆమె కొండెక్కి కూర్చోవడంతో పాటు ఆమె షూటింగ్ విషయంలో, బస విషయంలో పెట్టిన కండీషన్ల దెబ్బతోనే నిర్మాతలు జడుసుకున్నారని.. అందుకే ఆమెను తెలుగులో ఎంట్రీ చేయించలేదన్న టాక్ వచ్చేసింది.
అయితే ఇప్పుడు కొరటాల శివ – ఎన్టీఆర్ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఆచార్య ప్లాప్ తర్వాత కసితో ఉన్న కొరటాల ఎన్టీఆర్‌తో ఏకంగా పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ కొట్టాలని కసితో వర్క్ చేస్తున్నాడు. అందుకే కాస్టింగ్ విషయంలో కొరటాల రాజీ పడడం లేదు.
అంతవరకు బాగానే ఉంది. జాన్వీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండానే తన తల్లి స్టార్ హీరోయిన్ అయ్యాక ఏ రేంజ్‌లో కండీషన్లు పెట్టిందో ఇప్పుడు అంతకుమించిన కండీషన్లు పెడుతోందని అంటున్నారు. శ్రీదేవి బాహుబలి సినిమా కోసం పెట్టిన కండీషన్లు చూసే రాజమౌళి ఆమె ప్లేస్‌లో రమ్యకృష్ణను తీసుకున్నామని ఓపెన్‌గా చెప్పారు.
ఇక ఎన్టీఆర్ సినిమా విషయంలో ఆమె పెట్టిన కండీషన్లకు ఓకే చెప్పడం తమ వల్ల కాదని తేల్చిచెప్పిన నిర్మాతలు.. ఒక అసిస్టెంట్‌తో పాటు మరో మేకప్‌మేన్, రు. 4 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తామని చెప్పారట. ఈ సినిమా కూడా మిస్ అయితే తన సౌత్ ఎంట్రీ లేట్ అయ్యి కెరీర్‌కే దెబ్బ అనే జాన్వీ ఈ సినిమాకు సంతకం చేసిందని.. ఆమె తీరు మారకపోతే త్వరగానే దుకాణం సర్దేయాల్సిందే అంటున్నారు.