టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తొలి ప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది కీర్తిరెడ్డి. అంతకుముందు ఆలీకి జోడీగా గన్‌షాట్ లాంటి సినిమా చేసింది. నాగార్జున మరదలుగా రావోయి చందమామ సినిమాలోనూ నటించింది. కావాల్సినంత అందంతో పాటు బలమైన పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా కీర్తిరెడ్డి సినిమా రంగంలో రాణించేందుకు ఇష్టపడలేదు.
ఇందుకు ఆమె కెరీర్ లో జరిగిన సంఘటనలు కూడా సహకరించలేదు. నిజామాబాద్ మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి మనవరాలు ఈ కీర్తిరెడ్డి. కీర్తి తండ్రి కూడా రాజకీయ నాయకుడే. టీఆర్ఎస్‌లో ఉండే కీర్తి తండ్రి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లి నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రావోయి చందమామ షూటింగ్ టైంలో అక్కినేని వారసుడు సుమంత్‌తో ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య ఘాడమైన ప్రేమకు దారితీసింది.
సుమంత్ అంటేనే చాలా సైలెంట్‌గా, మూడీగా ఉంటాడు. సుమంత్‌కు బయట వ్యాపకాలు తక్కువ. సుమంత్ తన కెరీర్‌లో ఎక్కువ సమయం తన తాత ఏఎన్నార్‌ను చూసుకునేందుకే కేటాయించేవాడు. అందుకే ఏఎన్నార్ చివర్లో గడిపిన ఇంటిని కూడా సుమంత్ పేరిట రాసేశాడు. సుమంత ఈ తరం జనరేషన్ యంగ్ హీరోల్లా దూసుకుపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు.
అయితే చాలా మంచివాడు. కీర్తిరెడ్డి సుమంత్ మంచితనాన్ని చూసి ప్రేమలో పడింది. ఆమె తప్పులేదు. అయితే ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడు తనకు సూట్ అవుతాడా ? అతడితో కలిసి జీవితాంతం ట్రావెల్ అవుతానా ? అన్న విషయంలో ఆమె ఓ అంచనాకు రాలేకపోయింది. పెళ్లయ్యాక ఇక్కడ వద్దు… తన ఫ్యామిలీ నుంచి వచ్చిన కోట్లాది రూపాయల వ్యాపారాలు అమెరికాలో ఉన్నాయని.. వాటిని చూసుకుంటే చాలు.. అమెరికాలో సెటిల్ అయిపోదామని ఒత్తిడి చేసింది.
సుమంత్ తన బలమైన అక్కినేని లెగసీని సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తానని.. దానిని వదులుకోనని తెగేసి చెప్పాడు. అలా ఇద్దరూ విడిపోయారు. కేవలం వైరుధ్యమైన అభిప్రాయాలతో విడిపోయారే తప్పా.. వీరి మధ్య ఇంకేం లేదు. ఇక మాజీ మిస్ ఇండియా శిల్పారెడ్డికి ఆమె కజిన్ అవుతుంది. కీర్తిరెడ్డి సోదరుడికి శిల్పా భార్య. ఇక కీర్తిరెడ్డికి విడాకులు ఇచ్చేశాక కూడా సుమంత్ మాత్రం తన మాజీ భార్యతో స్నేహానికి కొనసాగిస్తూనే ఉన్నాడు.
కీర్తి సుమంత్ నుంచి విడాకులు తీసుకున్నాక ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. ఆమె అప్పుడప్పుడు తన కుటుంబాల్లో జరిగే పెళ్లి ఫంక్షన్లకు ఇండియా వస్తూ ఉంటారు. రీసెంట్‌గా ఆమె నటించిన తొలిప్రేమ రిలీజ్ అయ్యి 25 ఏళ్లు పూర్తయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా కీర్తిరెడ్డి ఫేస్‌లో ఛార్మింగ్ మాత్రం తగ్గలేదు.