దివంగత అందాల తార ఆర్తీ అగర్వాల్ ఎంత త్వరగా తెలుగు సినీ విలాకాసంలో ఓ వెలుగు వెలిగిందో అంతే త్వరగా దివికేగింది. ఆమె జీవితమే ఓ సంచలనం. తొలి రెండు, మూడు సినిమాలే సూపర్ హిట్.. వరుసగా స్టార్ హీరోలతో ఛాన్సులు. 2001 నుంచి 2005 వరకు నాలుగేళ్లలో ఏ స్టార్ హీరో చూసినా ఆమె వెంటే పడేవారు. అంతే నాలుగేళ్ల తర్వాత కెరీర్ ఒక్కసారిగా ఢమాల్. యంగ్ హీరోతో ప్రేమాయణాలు.. వైఫల్యాలు.. పెళ్లి.. పెటాకులు.. మృతి.
ఇక అమెరికాలో ఉన్న ఆర్తీని ఓ ఫొటో చూసి మరీ నిర్మాత సురేష్‌బాబు పట్టుబట్టి నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అదే బ్యానర్లో నువ్వులేక నేనులేను సినిమా చేస్తే అదీ సూపర్ హిట్టే. ఆ తర్వాత ఆమెకు తిరుగులేదు. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆమెకు హైదరాబాద్‌లో తెలిసిన వారు ఎవ్వరూ లేరు. ఆ టైంలోనే ఆమెకు అప్పుడే హీరోయిన్‌గా వచ్చిన ఛార్మీ మంచి ఫ్రెండ్ అయ్యింది.
ఛార్మీ కూడా ఆర్తీ టైంలోనే భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో దీపక్ హీరోగా వచ్చిన నీతోడు కావాలి సినిమాతో హీరోయిన్ అయ్యింది. అప్పుడు ఛార్మీ, ఆర్తీ ఇద్దరూ ఒకే ఏజ్ గ్రూప్‌లో ఉండేవారు. ఛార్మీ కంటే ఆర్తీ ముందు పెద్ద స్టార్ అయిపోవడంతో పాటు తక్కువ టైంలోనే అందరు స్టార్ హీరోలతో వరుస పెట్టి చేసేసింది. ఛార్మీ క్రమక్రమంగా నిలదొక్కుకుంది.
ఆ టైంలో ఆర్తీ, ఛార్మీ ఇద్దరూ కూడా కొద్ది రోజుల పాటు ఒకే రూమ్‌లో ఉండేవారట. రామానాయుడు స్టూడియోలో ఉన్న ఓ గెస్ట్ హౌస్‌లో కలిసుండడం లేదా బయట హోటల్స్‌లో ఉన్నప్పుడు కూడా ఒకే రూమ్‌లో ఉండి సీక్రెట్‌గా యాక్టింగ్ స్కిల్స్‌పై ప్రాక్టీస్ చేసేవారట. అప్పటకి వాళ్లిద్దరికి నటనలో పెద్దగా అనుభవం లేదు. అందుకే రాత్రిళ్లు ఎక్కువుగా ఈ స్కిల్స్‌పై చర్చించుకునేవారట. ఆ తర్వాత కాలంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు అయిపోయారు.