నాటి తరం హీరోయిన్లకు… నేటి తరం హీరోయిన్లకు చాలానే తేడాలు ఉన్నాయి. ఇప్పుడున్న హీరోయిన్లకు.. పెద్ద మైనస్ ఏంటంటే..ఎక్కవ సినిమాల్లో వారు కనిపించరు. ఒకటి రెండు సినిమాలు చేస్తే.. అయిపోయి నట్టే అనే పేరుంది. ఎవరో ఒకరిద్దరు.. సమంత వంటివారు తప్ప.. మిగిలిన వారంతా .. ఒకటి రెండు సినిమాలతోనే పరిమితం అయిపోయారు. కానీ, నాటి తరాన్ని తీసుకుంటే జయసుధ, జయప్రద, రాధ, రాధిక, భానుప్రియ, విజయశాంతి వంటివారు.. చాలా సినిమాల్లో నటించారు.
రెండుమూడు దశాబ్దాల పాటు సినిమాలు చేసిన చరిత్రనుకూడా సొంతం చేసుకున్నారు. అయితే.. వీరిలో మరో లక్షణం కూడా ఉండేది. సహజంగా హీరోలకు మాత్రమే పరిమితమైన (అప్పట్లో) వీకెండ్ పార్టీల్లో హీరోయిన్లు కూడా పాలుపంచుకునేవారు. ప్రతి సండే తమిళనాడులో షూటింగ్‌లకు సెలవు ఇచ్చేవారు. ఇప్పుడు లేదనుకోండి. దీంతో ప్రతి ఆదివారం.. హీరోయిన్లు తప్పకుండా కలుసుకునేవారు. వారి మధ్య చనువు కూడా అలానే ఉండేది.
అంతేకాదు.. జయసుధ బిలియర్డ్ గేమ్ నిపుణురాలు. జయప్రదకు ఛెస్ అంటే పంచప్రాణాలు. రాధకు స్విమ్మింగ్ అంటే ప్రాణం. ఇతర హీరోయిన్లకు కూడా స్విమ్మింగ్ వచ్చినా.. రాధకు వచ్చినంత వేగం.. పట్టు వారికి లేవు. ఇక, భానుప్రియకు హాకీ అంటే ఇష్టం. ఒక సినిమాలో డైరెక్టర్ ఆమె కోసం రెండు సీన్లు కూడా చేశారు. అదేవిధంగా విజయశాంతికి టెన్నీస్ అంటే ఇష్టం.
ఇలా.. ఒక్కొక్క హీరోయిన్‌కు ఒక్కొక్క క్రీడ అంటే ఇష్టం ఉండేదట. రాధికకు క్రికెట్ అంటే ఇష్టం. ఇప్పటికీ తమిళనాడులో ఏటా మహిళా క్రికెట్‌ను ప్రోత్సహిస్తున్నారు ఆమె. ఇలా.. నాటి తరం హీరోయిన్లు ప్రత్యేకంగా ఉండేవారు. కానీ, నేడు చెప్పుకొనేందుకు ఏమీ కనిపించడంలేదనేది అందరికీ తెలిసిందే. సావిత్రికి కూడా క్రీడలంటే ఇష్టం. భానుమతికి పాటలంటే ప్రాణం. ఇలా.. అప్పటి తరం అన్ని రంగాల్లోనూ దూసుకుపోయింది.