Moviesకాస్ట్లీ వెడ్డింగ్: సినిమా ఇండస్ట్రిలోనే ఇది ఓ రికార్డ్..పెళ్ళి కోసం...

కాస్ట్లీ వెడ్డింగ్: సినిమా ఇండస్ట్రిలోనే ఇది ఓ రికార్డ్..పెళ్ళి కోసం ఒక్క రోజుకి అన్ని కోట్లా..?

ఈ మధ్యకాలంలో పెళ్లి అంటే ఖర్చులతో కూడుకున్న పనులు అయిపోతున్నాయి . గతంలో పెళ్లి అంటే చాలా సరదాగా ..అల్లర్లతో ఆటపాటలతో.. బంధుమిత్రులతో కలిసి చేసుకునే వాళ్ళు .కానీ ఇప్పుడు పెళ్లంటే ఎంత బాగా చేసుకున్నాం కాదు… ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామంటూ క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్నారు స్టార్ కపుల్స్ ఈ క్రమంలోనే రీసెంట్గా జరిగిన అన్ని వెడ్డింగ్స్ కోట్లకు కోట్లు ఖర్చు చేసి మరి చేసుకున్నారు .

మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పెళ్లి వేడుకకు ఖర్చు చేస్తున్న డబ్బులు సామాన్య జనాలు కొన్నేళ్లపాటు కష్టపడకుండా బ్రతికేయొచ్చు ..అంతలా డబ్బులని కుమ్మరిస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీయారా అద్వాని.. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ లోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు . ఇప్పటివరకు ఏ జంట ఖర్చు పెట్టనని కోట్లు తమ పెళ్లి కోసం ఖర్చు పెడుతూ బాలీవుడ్ లోనే అత్యంత కాస్ట్లీ వెడ్డింగ్ గా పేరు సంపాదించుకుంటున్నారు.

అతి తక్కువ మంది స్నేహితులు ..బంధువులు ..కుటుంబ సభ్యుల మధ్య వీళ్ళ పెళ్లి జరగబోతుంది. ఫిబ్రవరి 6వ తేదీ అంగరంగ వైభవంగా రాజస్థాన్ లోని సూర్యగట్ ప్యాలెస్ లో వీరి వివాహం జరగబోతుంది . కాగా దాదాపు 150 మంది విఐపి ల కోసం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది . అంతేనా అతిధుల కోసం దాదాపు 90 లగ్జరీ వాహనాలను బుక్ చేసుకున్నారట .

మరీ ముఖ్యంగా అతిధులు వస్తే ఉండడానికి రూమ్స్ కోసం .. ఏకంగా రోజుకు 9 కోట్లు ఖర్చు చేసే విలువైన హోటెల్ ని బుక్ చేశారట. రెండు విల్లాలు రెండు పెద్ద రెస్టారెంట్లు మద్యం లేకుండా ఈ హోటల్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారట . అంతేకాదు .. దాదాపు వీళ్ళు బస చేస్తున్న హోటల్ ఖరీదు ఒక్కరోజు కాస్ట్ 9 కోట్లకు పైగానే ఉంటుంది అంటూ బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . ఇక అన్ని ఖర్చులు కలిపితే దాదాపు 11 , 12 కోట్లు దాటుతుంది ఇలా చూసుకుంటే ఇప్పటివరకు బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన వెడ్డింగ్ చేసుకున్న జంటలలో ముందు వరుసలో ఉంటారు సిద్ధార్థ మెల్హోత్రా, కీయారా అద్వాని..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news