బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్ ను మొదలుపెట్టి కుర్రకారు హృదయాలను దోచుకున్న హీరోయిన్లలో సమంత ఒకరు. ఏ మాయ చేశావే సినిమా నుంచి యశోద సినిమా వరకు ఏ సినిమాలో కూడా సమంత నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. పాత్రకు అనుగుణంగా లుక్ ను మార్చుకునే సమంత సోషల్ మీడియాలో కూడా మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. యాడ్స్ ద్వారా కూడా ఈ బ్యూటీ బాగానే సంపాదిస్తున్నారు.
అయితే గత రెండు, మూడేళ్లుగా ఆమె కెరీర్లో ఏదో ఒక ఇబ్బంది వస్తోంది. చైతుతో విడాకులు.. సినిమాలు అనుకున్న రేంజ్లో సక్సెస్ కాకపోవడం, ముఖ్యంగా ఓ సారిఇ స్కిన్ ప్రాబ్లమ్, ఇప్పుడు మయోసైటిస్ వ్యాధి ఇలా చాలా సమస్యలతో ఆమె పోరాటం చేస్తోంది. అయితే సమంత అమవాస్య రోజున పుట్టారనే సంగతి ఆమె అభిమానులలో చాలా తక్కువమందికి తెలుసు. అమవాస్య రోజున పుట్టడం వల్లే ఆమె వ్యక్తిగత జీవితంలో, ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు వచ్చాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పండితులు చెబుతున్న విషయాల ప్రకారం అమావాస్య రోజు పుట్టడం వల్ల లైఫ్ లో కష్టాలు పడాల్సి ఉంది. అమావాస్య రోజున పుట్టినవాళ్లకు ప్రేమ, ఆర్థిక విషయాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. అమావాస్య రోజు పుట్టడం వల్ల ఆడపిల్లలకు కొన్ని లాభాలు ఉన్నా లాభాలతో పోల్చి చూస్తే నష్టాలు ఎక్కువ. అమావాస్య రోజు పుట్టిన వాళ్లకు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండటంతో పాటు వీళ్లు ఏదైనా అపశకునం కోరుకుంటే అదే విధంగా జరుగుతుందట.
సమంత పుట్టినరోజే ఆమె పాలిట శాపమైంది. కొన్ని పూజలు, నివారణలు పాటిస్తే సమంత జీవితం బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగచైతన్య సమంత విడిపోవడానికి సమంత అమావాస్య రోజు పుట్టడమే కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. వేణుస్వామి కూడా సమంత జాతకం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అసలు వీరి పెళ్లి జరిగిన కొద్ది నెలలకే వీరు విడిపోతారని వేణుస్వామి చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. తర్వాత అవే నిజం అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సమంత ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇవ్వడం కొంతమంది ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. సమంత నటించిన శాకుంతలం రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉండగా ఖుషి మూవీ ఎప్పటికి పూర్తవుతుందో చూడాల్సిఉంది.