తలరాత అనేది ప్రతి మనిషికి ఉంటుంది. దానిని ఎప్పుడూ ఎవ్వరూ మార్చలేరు. ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులే బయట వాళ్లకు పెద్ద వరాలుగా మారుతూ ఉంటాయి. అవి మన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు అవుతాయి. ఓ స్టైలీష్ ఆటోడ్రైవర్ కాస్తా అంతకుముందు పెద్ద గ్యాంగ్‌స్టర్ అన్న నిజం తెలిస్తే ఎలా ఉంటుంది ? అంత పెద్ద గ్యాంగ్‌స్టర్ జీవితంలో ఏం జరిగిందన్న కథాంశంతో రజనీకాంత్ బాషా సినిమా వచ్చింది.
సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చి రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఇప్పటకీ సినిమా చూస్తుంటే ఏదో కొత్తగా ఉంటుంది.. ఇప్పటకీ మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అసలు ఈ సినిమా ఎంత గొప్ప ప్రభావం చూపించిందో అర్థమవుతోంది. నగ్మా హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో తమిళ ఇండస్ట్రీని మాత్రమే కాదు.. సౌత్ సినిమాను ఓ ఊపు ఊపేసింది ఈ సినిమా.
బాషాలో రజనీకాంత్ డైలాగులు, స్టైల్, ఆ యాక్టింగ్ అదుర్స్. ఇక తమిళంలో హిట్ అయ్యాక ఈ సినిమాను తెలుగులో కూడా తీయాలని అనుకున్నారు. హైదరాబాద్‌లో ప్రివ్యూ షో వేశారు. దర్శకుడు సురేష్‌కృష్ణ చిరంజీవి లేదా బాలయ్యతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారట. సురేష్ కృష్ణ అయితే బాలయ్యకే ఈ కథ బాగా యాప్ట్ అవుతుందని చెప్పారట.
అయితే బాలయ్యకు అప్పట్లో రీమేక్ సినిమాలు చేయడం ఏ మాత్రం ఇష్టం ఉండేదే కాదు. చేస్తే గీస్తే డైరెక్ట్ కథలతోనే సినిమాలు చేసి హిట్ కొట్టాలని ఖరాఖండీగా చెప్పేవాడు. బాలయ్యను చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోకపోవడంతో చివరకు ఈ సినిమాను తెలుగులో డబ్బ్ చేసి రిలీజ్ చేయాలని తమిళ నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అయితే తెలుగులో కూడా బాషా సూపర్ హిట్ అయ్యింది.
అయితే ఆ తర్వాత బాలయ్య తన కెరీర్‌లో తమిళ్‌లో హిట్ అయిన సామీ లాంటి రీమేక్ సినిమాలు లక్ష్మీనరసింహాలో నటించారు. బాషా ను కూడా ఆయన వదులుకోకుండా తెలుగులో చేసి ఉంటే ఖచ్చితంగా బాలయ్య కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోయి ఉండేది.