సాధారణంగా ప్రతి కుటుంబంలో గొడవలు కామన్ ..భార్యాభర్తలకి ..తల్లిదండ్రులకి ..కొడుకు తండ్రికి ..తల్లి కోడలికి ..ఇలా గొడవలు వస్తూనే ఉంటాయి. అయితే స్టార్ సెలబ్రిటీస్ అయితే మాత్రం ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి భూతద్దంలో చూస్తూ ఉంటారు కొందరు జనాలు . అల్లు ఫ్యామిలీకి సంబంధించిన గొడవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే అల్లు అర్జున్ ఎంతటి స్టార్ హీరోనో .. పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న స్టైలిష్ స్టార్ .
కాగా రీసెంట్గా పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ త్వరలోనే టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాంతో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అల్లు అరవింద్ కూడా ఫిక్స్ అయిపోయాడు . కానీ పరశురాం లాస్ట్ లో హ్యాండ్ ఇస్తూ గీతగోవిందం2 సినిమా ని దిల్ రాజు చేతిలో పెట్టేశారు . ఈ క్రమంలోనే పరశురాం పై మండిపడుతున్నాడు అల్లు అరవింద్ . అతగాడితో మన హీరోలు సినిమా చేయొద్దు అంటూ కండిషన్ పెట్టారట . అయితే ఆ కండిషన్ ఏం మాత్రం వినని అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను పరశురాం డైరెక్షన్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట.
దీనికి సంబంధించిన స్కిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తయిందట ..పుష్ప 2 అయిపోగానే సెట్స్ పైకి రానుంది. అయితే లాస్ట్ మూమెంట్లో దిల్ రాజు వచ్చి పెంట పెంట చేయడంతో బన్నీ – అల్లు అరవింద్ మధ్య గొడవలు మొదలయ్యాయి . దీంతో తండ్రి మాటని ఎదిరించి అంత స్థాయికి వెళ్ళిపోయాడట అల్లు అర్జున్. దిల్ రాజు మధ్యలో దూరకుండా ఉంటే అల్లు అర్జున్ – అల్లు అరవింద్ – పరుశురాం ప్రశాంతంగా తమ పని చేసుకునేవాళ్ళు..ఆయన్ పెట్టిన పెంట ఇప్పుడు అందరి పాలిట తంటగా మారింది. చూద్దాం ఏం చేస్తారో ఈ తంద్రి-కొడుకులు..!!