వంశీ పేరు చెబితేనే మనకు గోదావరి అందాలు.. గోదావరి తీరాలు.. గోదావరి పల్లెలు గుర్తుకు వస్తాయి. ఆయన తన సినిమాలలో వీటిని ప్రధానాంశాలుగా చేసుకునేవారు. పల్లెటూరి ప్రేమ కథలు, పల్లెటూరి మనుష్యులను తన సినిమాలలో ఎంతో అందంగా చూపించి ఎన్నో మరపురాని మధురానుభూతులు మనకు మిగిల్చారు. వంశీ సినిమాలలో ఎక్కువ సినిమాలు పల్లెల నేపథ్యంలోనే తెరకెక్కాయి.
ఆయన సినిమాలలో స్వచ్ఛమైన ప్రేమ మనకు కనిపిస్తుంది. ఇక శేఖర్ కమ్ముల తన సినిమాలలో హీరోయిన్లను ఎంత సాంప్రదాయంగా… ఎంత అందంగా చూపిస్తారో అప్పట్లో వంశీ కూడా తన సినిమాల్లో హీరోయిన్లను అంతే అందంగా చూపిస్తారు అన్న పేరు తెచ్చుకున్నారు. ఇక అప్పట్లో వంశీ సినిమాలలో భానుప్రియ హీరోయిన్గా ఎక్కువగా కనిపించేవారు. వంశీ సినిమా అంటే భానుప్రియ హీరోయిన్ గా ఉండటం కామన్ అయిపోయేది.
అయితే వీరి ప్రేమపై చాలామంది ఓపెన్ అయ్యారు. ప్రముఖ కెమెరామెన్లలో ఒకరు అయిన ఎంవి రఘు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక సినిమాలో హీరోయిన్ భానుప్రియకు మేకప్ ఎక్కువ అవడంతో… తాను ఈ విషయం అందరి ముందు చెప్పడంతో వంశీ ఫీలయ్యారని.. అప్పుడు భానుప్రియ కూడా హర్ట్ అయిందన్నారు. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే వారిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారన్న రూమర్ అప్పటికే ఉందని రఘు చెప్పారు.
ముందు భానుప్రియను వంశీ ఇష్టపడటం.. ఆ తర్వాత తనకు కెరీర్ ఇచ్చాడని కృతజ్ఞతతో ఆమె కూడా కోపరేట్ చేసిందని రఘు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇక భానుప్రియ తో ప్రేమలో పడిన సమయానికే వంశీకి పెళ్లయింది. భానుప్రియను పెళ్లి చేసుకునేందుకు వంశీ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డాడు. అయితే భానుప్రియ తల్లి మాత్రం అందుకు ఇష్టపడలేదట.
మీ ఇద్దరూ మీ కెరీర్ పై పూర్తిగా దృష్టిపెట్టాలని… మీరు ఇలా ప్రేమలో పడితే మీ కెరీర్ నాశనం అవుతుందని భానుప్రియ తల్లి ఇద్దరిని హెచ్చరించారట. అలాగే నువ్వు నీ భార్యకు విడాకులు ఇచ్చి భానుప్రియని పెళ్లి చేసుకుంటే… ఇద్దరికీ అన్యాయం చేసినట్లు అవుతుందని హితబోధ చేశారట. భానుప్రియ తల్లి అలా చెప్పడంతో చివరకు వంశీ భానుప్రియను పెళ్లి చేసుకునే ఆలోచన విరమించుకున్నారని అలా వారి ప్రేమకు ఎండ్‌కార్డు పడిందని అప్పట్లో బలంగా వినిపించిన టాక్.