తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావుకు చాలా దూర దృష్టి ఉండేది. ఆయన వచ్చిన ప్రతి సినిమా ఆఫర్‌ను అంగీకరించేవారు కాదు. ఆ సినిమా కథ విన్నాక.. దాని లోతుపాతులు కూడా చర్చించేవారు. ఇది హిట్ అవుతుందని అనుకుంటేనో.. లేక ఫర్వాలేదని భావిస్తేనో.. సినిమాకు ఒప్పుకొనేవారు. లేక పోతే.. వేరేవారిని పెట్టుకోండ
అని నిర్మొహమాటంగా చెప్పేసే వారు.
ఇలా.. ఒకసారి భానుమతి సొంత బ్యానర్ భరణి పిక్చర్స్ పతాకంపై చింతామణి నాటకాన్ని సినిమాగా తెరకె క్కించాలని భావించారు. ఇదే విషయాన్ని నాగేశ్వరరావుకు చెప్పారు. అయితే.. దీనికి అక్కినేని ఒప్పుకోలేదు. చింతామణిపై తనకు అవగాహన ఉందని.. దీనిని సినిమాగా తీస్తే.. పేరు పోతుందని.. ఇది ఇరు పక్షాలకు మంచిదికాదన్నారు. ముఖ్యంగా భరణి పిక్చర్స్ అంటే ప్రతిష్టాత్మకమైన పేరుందని.. దానిని పోగొట్టుకోవద్దని కూడా ఆయన చెప్పారు.
అయితే.. అప్పటికే కథను రెడీ చేసుకోవడం.. కొందరికి అడ్వాన్సులు కూడా ఇచ్చి ఉండడంతో భానుమతి వెనక్కి తగ్గలేదు. పైగా ఆమె భర్త రామకృష్ణ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో అక్కినేని చెప్పి న మాట వినకుండానే.. ఆమె నేరుగా ఎన్టీఆర్‌ను సంప్రదించారు. ఈ సినిమాలో నటించాలని పట్టుబట్టా రు. పైగా.. అక్కినేనితో జరిగిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
అప్పటికే అక్కినేనికి.. ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు ఉండడంతో ఆయన పాత్రను తాను చేసి మెప్పించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. వెంటనే ఒప్పేసుకున్నారు. బిల్వమంగళుడి పాత్రను ఎన్టీఆర్‌కు ఇచ్చారు. నాటకంలో ఉన్నట్టుగా కాకుండా.. చింతామణిని భక్తురాలిగా తీర్చిదిద్దారు. పైగా.. ఇప్పట్లా సెన్సార్.. లిబరల్‌గా ఉండేది కాదు. విలువలకు ప్రాధాన్యం ఉండేది.
దీంతో ఈ సినిమాలో మాస్‌ను ఆకట్టుకునే డైలాగులకు కత్తెర పడిపోయింది. పలితంగా ఈ సినిమా అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను కూడా రంజింపజేయలేక పోయింది. ఫలితంగా అప్పట్లోనే భానుమతి 30 లక్షల వరకు నష్టపోయారట. దీనిని సంపాయించుకునేందుకు ఐదేళ్లు పట్టిందని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.