Movies"యస్..అతడు అంటే నాకు చచ్చేంత ఇష్టం"..ఫైనల్లీ ఓపెన్ అప్ అయిన అనుష్క..!!

“యస్..అతడు అంటే నాకు చచ్చేంత ఇష్టం”..ఫైనల్లీ ఓపెన్ అప్ అయిన అనుష్క..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా అనుష్కకు ఉండే క్రేజే వేరు . సినిమాలో ఎక్స్పోజింగ్ చేసిన సరే బయట చాలా పద్ధతిగా నిండైన వస్త్రధారణతో కనిపించే అనుష్క అంటే అభిమానులకు చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా అనుష్క టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక .. స్టార్ సెలబ్రెటీస్ కూడా దీనికోసమే వెయిట్ చేస్తున్నారు.

అయితే అనుష్క మాత్రం మా మధ్య అలాంటిది ఏమీ లేదు అంటూ చెప్పుకొస్తూనే ఉంది .ప్రభాస్ కూడా మా మధ్య అలాంటిదేమీ లేదు అంటూ ఓపెన్ అప్ అవుతూనే ఉన్నాడు. కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా .. గతంలో అనుష్క శెట్టి మాట్లాడిన ఓ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఆ వీడియోలో అనుష్క తన క్రష్ గురించి బయట పెట్టింది.

ఆయన ఎవరో కాదు అప్పట్లో క్రికెట్ టీం ని అల్లాడించిన రాహుల్ ద్రావిడ్ . ఎస్ ఇప్పుడంటే అందరూ ధోని , విరాట్ కోహ్లీ అంటూ ఫాన్స్ గా చెప్పుకుంటున్నారు గాని.. అప్పట్లో అందరికీ కామన్ గా నచ్చిన వ్యక్తి రాహుల్ డ్రావిడ్.. బ్యాట్ తీసుకొని గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తే చాలు ఫటా ఫటా అంటూ ఫోర్లు , సిక్స్ లు పోవాల్సిందే . అలాంటి ఆటగాడు . కాగా ఇంటర్వ్యూలో భాగంగా అనుష్క ..రాహుల్ డ్రావిడ్ అంటే నాకు క్రష్ అని.. చచ్చేంత ఇష్టమని చెప్పుకొచ్చింది .

వాలెంటైన్స్ డే సందర్భంగా ఆ వీడియో ట్రెండ్ చేస్తున్నారు అనుష్క ఫ్యాన్స్. కాగా అనుష్క మాత్రం ప్రభాస్ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు, ప్రభాస్ కూడా అంతే సైలెంట్ గా ఉంటున్నాడు. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారన్నది మాత్రం కన్ఫామ్ అంటూ సినీ ప్రముఖులు కూడా ఫిక్స్ అయిపోయారు . చూద్దాం ఈ జంట ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news