Moviesడార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ప్రభాస్ అమ్మ ను మీట్ అయిన...

డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ప్రభాస్ అమ్మ ను మీట్ అయిన అనుష్క పేరంట్స్..!!

ఎస్.. ఇది నిజంగా డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ మరికొద్ది రోజుల్లోనే రివీల్ కాబోతుంది అంటూ రెబెల్ ఫాన్స్ హ్యాపీగా కామెంట్స్ చేస్తున్నారు . మనకు తెలిసినదే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ గత కొంతకాలంగా హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రేమాయణం నడుపుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మా మధ్య అలాంటిది ఏమీ లేదురా బాబోయ్ అంటూ నెత్తి నోరు మొత్తుకున్నా సరే జనాలు నమ్మడం లేదు .

దానికి కారణం వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి.. పబ్లిక్ లో వాళ్లు ఎంత దాచాలనుకున్న వాళ్ళ మీద ఉన్న ప్రేమను కళ్ళల్లో చూపించేస్తూ అఫీషియల్ గా వాళ్ళ ప్రేమను కన్ఫామ్ చేసుకున్నారు ప్రభాస్ – అనుష్క శెట్టి . ఇప్పటివరకు వీళ్ళు కలిసి నటించిన సినిమాలలో కెమిస్ట్రీ చూస్తే ఆ విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది. అనుష్క మరి ఏ హీరోతో కూడా ఆ రేంజ్ లో రొమాన్స్ చేసి మెప్పించి ఉండదు .

ప్రభాస్ కూడా అంతే తన పని చేసే హీరోయిన్స్ తో దూరంగా ఉంటూ ఉండే ప్రభాస్ .. అనుష్కతో మాత్రం చాలా క్లోజ్ అవుతారు. అంతెందుకు కృష్ణంరాజు మరణించే కొన్ని గంటల ముందు కూడా అనుష్క హాస్పిటల్ లో దర్శనమిచ్చిన విజువల్స్ వైరల్ అయ్యాయి. కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ప్రభాస్ అమ్మగారిని ..అనుష్క పేరెంట్స్ మీట్ అయినట్లు తెలుస్తుంది . అయితే వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడడానికే మీట్ అయ్యారు అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సినిమా ప్రముఖులు సైతం ప్రభాస్ పెళ్ళి విషయం మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి డార్లింగ్ ..అభిమానులకు ఎలాంటి గుడ్ న్యూస్ వినిపిస్తాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news