సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్లు ప్రేమలో పడటం పెళ్లిళ్లు చేసుకోవడం చాలా కామన్ గా జరుగుతూ వస్తోంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో సరాసరి సగటున నెలకు ఒక ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతోంది. మరెంతోమంది కుర్ర హీరోలు.. హీరోయిన్లు ప్రేమలో.. డేటింగ్ లతో మునిగి తేలుతున్నారు. అయితే హీరోలు, హీరోయిన్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం అనేది ఇప్పటి నుంచే కాదు.. మన టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల క్రితం నుంచే నడుస్తోంది.
1990వ దశంలో అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న నాగార్జున తన తోటి హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకొని పెద్ద సంచలనం క్రియేట్ చేశాడు. ఆ మాటకు వస్తే 1960 – 70వ దశంలోనూ స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మలది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. విచిత్రం ఏంటంటే అప్పటికే కృష్ణ, విజయనిర్మలకు వేరువేరు వ్యక్తులతో పెళ్లిళ్లు జరిగాయి. కృష్ణ తన భార్య ఉండగానే విజయనిర్మలను రెండో భార్యరీగా సేకరించారు.
విజయనిర్మల తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసి కృష్ణకు రెండో భార్యగా ఆయన జీవితంలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే హీరోయిన్లతో ఎంతో సభ్యతతో ఉంటారని పేరున్న దివంగత లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు సైతం అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారట. ఆ హీరోయిన్ ప్రేమలో మునిగి తేలుతున్న ఏఎన్ఆర్ ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయిపోయారట. అయితే ఏఎన్ఆర్ కు ముందు నుంచి స్టార్ డైరెక్టర్ దుక్కిపాటి మధుసూదనరావు గురువుగా ఉంటూ వచ్చారు.
ఏఎన్ఆర్ కెరీర్ ఆరంభంలో ఆయన నిలదొక్కుకునేందుకు మధుసూదనరావు ఎంతో సాయం చేశారు. ఇక ఎస్ వరలక్ష్మి స్వస్థానం ఆంధ్రప్రదేశ్ లోని జగ్గంపేట. ఆమె మంచి నటి.. మంచి గాయని కూడా..! సత్యహరిచంద్ర సినిమాలో చంద్రమతి పాత్రతో పాటు పలనాటి యుద్ధం సినిమాలు ఆమెను ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మార్చేశాయి. అయితే ఏఎన్ఆర్ వరలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం వరలక్ష్మిని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చిన గూడవల్లి రామబ్రహ్మంకు ముందుగా తెలిసింది.
ఆయన వెంటనే నువ్వు నాగేశ్వరరావుకు పెళ్ళి చేయకపోతే ఆయన వరలక్ష్మి దేవిని పెళ్లి చేసుకునేలా ఉన్నారని చెప్పారట. వెంటనే మధుసూదనరావు ఆగమేఘాల మీద ఏఎన్నార్‌కు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అన్నపూర్ణతో కాస్త గప్‌చుప్‌గా వివాహం నిశ్చయించి వెంటనే పెళ్లి జరిపించేసారట. నాగేశ్వరరావు వరలక్ష్మీదేవి ప్రేమకు డైరెక్టర్ మధుసూదనరావు మధ్యలో అడ్డు పడ్డారు. ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీ జనాలందరికి తెలుసు. ఆ తర్వాత వరలక్ష్మి తమిళ స్టార్ కన్నదాసన్ తమ్ముడు పిఎల్ శ్రీనివాసన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. 2009లో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు.