టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ వుందో తెలిసిందే. ఆరేడు దశాబ్దాలుగా ఈ ఫ్యామిలీకి చెందిన హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోలుగా నాగచైతన్య – అఖిల్ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. ఏఎన్నార్ తనయుడుగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున వ్యక్తిగత జీవితం ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులకు లోనైంది. ముందుగా దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మితో వివాహం జరగగా నాగచైతన్య జన్మించాడు.
అనంతరం మనస్పర్ధలు రావడంతో శ్రీలక్ష్మికి విడాకులు ఇచ్చిన నాగార్జున హీరోయిన్ అమలను రెండో పెళ్లి చేసుకోగా… ఈ దంపతులకు అఖిల్ జన్మించాడు. అయితే నాగార్జున శ్రీలక్ష్మిని వదిలించుకుని అమలను రెండో పెళ్లి చేసుకోవడం ఏఎన్నార్ కు ఎంత మాత్రం ఇష్టం లేదని చెబుతూ ఉంటారు. రామానాయుడుతో వియ్యంకుడిగా ఉండేందుకు ఏఎన్నార్ ఎంతో ఇష్టపడే వారని… ఆయనతో తన అనుబంధం ఎంతో గొప్పదని… అలాంటి బంధాన్ని తెంచుకునేందుకు నాగార్జున ప్రయత్నించటం ఏఎన్నార్‌కు అస్సలు ఇష్టం లేదనే వారు.
అమల మాత్రం ఏఎన్నార్ మనసు దోచుకునేందుకు ప్రారంభంలో చాలా ప్రయత్నాలు చేసిందని అంటారు. నాగార్జునతో తాను జీవితకాలం కలిసి ఉండాలని.. అందుకోసం చాలా రిస్కులు చేసిందని అంటూ ఉంటారు. అమలతో పెళ్లి తర్వాత కూడా నాగార్జున టబుతో ప్రేమాయణం నడిపారన్న వార్తలు తెలిసిందే. అఖిల్ చిన్నవయసులో ఉండగానే అమల పట్టుబట్టి మరి ఓ ఇంగ్లీష్ సినిమాకు రీమేక్ గా సిసింద్రీ సినిమాలో నటింప చేశారు.
ఇందుకు కారణం ఏంటంటే అఖిల్ ఏఎన్నార్ మనవడిగా… అక్కినేని ఫ్యామిలీ భవిష్యత్తు వారసుడిగా ప్రజెంట్ చేసేందుకు ఆమె తెలివైన ఎత్తుగడ వేశారట. అలాగే తన జీవితం కలకాలం సంతోషంగా ఉండాలని ఆమె అప్పట్లో గుండు కూడా చేయించుకున్నారట. ఏఎన్నార్‌ను అపురూపంగా చూసుకుంటూ ఆయనకు దగ్గరయ్యేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు.
ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత కానీ ఏఎన్నార్ అమలను మనస్ఫూర్తిగా కోడలిగా అంగీకరించలేదని.. అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించేవి. అయితే తర్వాత నాగార్జున.. టబుతో చాలా సన్నిహితంగా ఉండడంతో అమల కొంత టెన్షన్ పడినా..తర్వాత చాలా సక్సెస్ ఫుల్‌గా తన భర్తను తన దారిలోకి తెచ్చుకుందని అంటూ ఉంటారు.