Moviesపబ్లిక్ గానే ఆ విషయాని చెప్పేసిన బన్నీ భార్య.. టూ రొమాంటిక్...

పబ్లిక్ గానే ఆ విషయాని చెప్పేసిన బన్నీ భార్య.. టూ రొమాంటిక్ రా బాబోయ్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . అతని పేరుకి పరిచయాలు చేయకుండా ఉండే స్థాయికి ఎదిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ . మెగాస్టార్ చిరంజీవి – అల్లు అరవింద్ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టైలిష్ స్టార్ .. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తున్నాడు.

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఎంత పేరు .. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతకు డబల్ రేంజ్ లో ఆయన భార్య స్నేహారెడ్డి యాక్టివ్ గా ఉంటూ అభిమానుల్ని తన కొత్త ఫోటోలు తో ..పిల్లల వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా బన్నీ భార్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే బన్నీ భార్యా .. భర్తపై ప్రేమ కురిపిస్తూ ఓ ఫోటోతో దర్శనమివ్వడం జనులకు ఆశ్చర్యాన్ని గురిచేసింది.

ప్రస్తుతం బన్నీ భార్య స్నేహారెడ్డి హైదరాబాదులో ఉంది . అయితే అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 షూటింగ్ కోసం వైజాగ్ లో ఉన్నాడు . దీంతో భర్తను చాలా మిస్ అవుతున్న బన్నీ భార్య విరహవేదనకు గురవుతున్నట్లు కనిపించింది . ఈ క్రమంలోనే బన్నీని కౌగిలిలో బంధించిన ఫోటోను పబ్లిక్ గా షేర్ చేస్తూ బన్నీను ట్యాగ్ చేస్తూ మరియు ” మిస్ యు” అని ఇన్స్టా స్టోరీ పోస్ట్ చేసింది. దీనితో సెకండ్స్ లోనే ఈ ఫోటో వైరల్ గా మారింది . దీంతో పలువురు నెటిజన్స్ బన్నీ భార్య కు బన్నీ అంటే ఎంత ప్రేమో ఒక్కరోజు కూడా విడిచి ఉండలేక పోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . తన భర్తకు ఇలా దూరంగా ఉండలేకపోతోంది పాపం.. రమ్మని బన్నీకి సిగ్నల్ ఇస్తుంది అంటూ మరికొందరు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news