సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ ప్రైవేట్ లైఫ్ కి భంగం ఏర్పడుతుంది . కేవలం స్టార్ సెలబ్రిటీస్ కే కాదు చిన్న చిన్న రోల్స్ చేసుకుని సెలబ్రిటీలకు ..క్యారెక్టర్ ఆర్టిస్టులకు ప్రైవసీ లేకుండా పోతుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ బడా స్టార్స్ ప్రైవేట్ లైఫ్ ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు కొందరు ఆకుతాయిలు. మొన్నటికీ మొన్న విరాట్ కోహ్లీ పర్సనల్ రూమ్ టూర్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో ధైర్యంగా పోస్ట్ చేశారు . దీనిపై ఆయన భార్య అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీ ఇద్దరు ఫైర్ అయ్యారు . అంతేకాదు బాలీవుడ్ బడా సెలబ్రెటీస్ కూడా మండిపడ్డారు.
అదే సిచువేషన్ ని ఫేస్ చేసింది బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియాభట్ . “తన ఇంట్లో ప్రైవసీగా ఉన్న టైంలో ఎవరో తనని వీడియో తీశారని ..ఆ టైంలోనే బయటకొచ్చి చూడగా.. ఎవరో పక్క దాబా పైనుంచి తన పర్సనల్ లైఫ్ ని క్యాప్చర్ చేస్తున్నారని మండిపడింది”. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె ఫైర్ అయ్యింది . “నా పర్సనల్ లైఫ్ కి భంగం కలిగిస్తున్నారా.. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా..? ఇదేం అభిమానం అంటూ మండిపడింది”.
దీనిపై అందాల బ్యూటీ జాన్వి కపూర్ కూడా స్పందించింది . “నాకు ఇలానే చాలా సార్లు జరిగింది ..వీళ్లు మారరు” అంటూ ఘాటుగా స్పందించింది . సెలబ్రిటీస్ కి పోసిన లైఫ్ ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అంటూ పలువురు స్టార్స్ మండిపడుతున్నారు. కాగా గతంలోను అలియా భత్-రణ బీర్ కి కి సంబంధించిన రొమాంటిక్ పిక్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.