టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. అసలు బాహుబలి సీరిస్ సినిమాలతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత అన్నీ వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలే చేసుకుంటూ పోతున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే
ఇటు బన్నీ క్రేజ్ కూడా అల వైకుంఠపురంలో, పుష్ప దెబ్బతో పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిపోయింది. పుష్ప ఎలాంటి ప్రచారం లేకుండా బాలీవుడ్లో ఏకంగా రు. 100 కోట్లు కొల్లగొట్టడం పెద్ద సెన్షేషనల్. అసలు ఈ విజయం దెబ్బతో అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ సినిమా కానీ, బన్నీ సినిమా రిలీజ్ అవుతున్నాయంటే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే.
ఇప్పుడు పుష్ప 2 సినిమా టార్గెట్ రు. 500 కోట్లు అంటున్నారు. ఇదిలా ఉంటే బన్నీ, ప్రభాస్ సినిమాలు రెండూ ఒకేసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్నాయి. వచ్చే యేడాది సమ్మర్ కానుకగా బన్నీ పుష్ప 2, అటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే లేదా మారుతి దర్శకత్వంలో చేస్తోన్న రాజా డీలక్స్ సినిమాలలో ఏదో ఒకటి రిలీజ్ కానున్నాయి.
బన్నీ పుష్ప 2ను వచ్చే సమ్మర్‌కు ఫిక్స్ చేసేశారు. ప్రభాస్ సినిమాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చే యేడాది సంక్రాంతికి ఒకటి, సమ్మర్‌కు ఒకటి రానున్నాయి. అంటే ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అవుతున్నాయి. అదే జరిగితే బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోతుందో చెప్పక్కర్లేదు. ఏదేమైనా ఈ ఇద్దరు స్టార్ హీరోల సమ్మర్ బాక్సాఫీస్ సమరం మామూలుగా ఉండదు. ఈ పోరులో ఎవరిది పైచేయో కాని అప్పటి వరకు టెన్షన్ మాత్రం మామూలుగా ఉండదు.