టాలీవుడ్లో సీనియర్ హీరోలు నాగార్జున, చిరంజీవి ఎంత బెస్ట్ ఫ్రెండ్సో చెప్పక్కర్లేదు. వీరిద్దరు స్నేహానికి సరికొత్త డెపిషినెషన్ ఇచ్చేంత గొప్ప స్నేహంతో మెలుగుతూ ఉంటారు. ఒకరిని ఒకరు ఎంతో గౌరవించుకుంటూ ఉంటారు. అయితే వీరిద్దరి మధ్య ఇప్పుడు ఓ విషయంలో చిన్న ఇష్యూ తలెత్తే పరిస్థితి ఉంది. ఆల్రెడీ కొద్ది నెలల క్రితమే ఇలాంటి పంచాయితీ జరిగినా అప్పుడు నాగ్ సర్దుకున్నాడు. దర్శకుడు మోహన్‌రాజాతో నాగార్జున ఓ సినిమా ప్లాన్ చేశాడు.
దానిని తన ల్యాండ్ మార్క్ మూవీగా తీయాలని అనుకున్నాడు. అయితే సడెన్‌గా సీన్లోకి చిరు ఎంటర్ అయిపోయాడు. తన గాడ్ ఫాదర్ సినిమా కోసం మోహన్‌రాజాను మెగా కాంపౌండ్‌లోకి లాక్కు వచ్చాడు. అలా నాగ్‌తో మోహనరాజా చేయాల్సిన సినిమా కుదర్లేదు. అయితే అప్పుడు చిరు స్వయంగా ఎంటర్ కావడంతో నాగ్ తప్పుకోక తప్పలేదు. మళ్లీ ఇప్పుడు అలాంటి పంచాయితీ ఈ ఇద్దరు హీరోల మధ్య స్టార్ట్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వస్తున్నాయి.
త్రినాథరావు నక్కిన ధమాకా సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఇప్పుడు ఏకంగా మెగా ఆఫర్ అందుకున్నాడు. మంచి స్టోరీ ఉంటే చెప్పమని చిరు అడగడం.. వెంటనే నక్కిన చెప్పిన కథ చిరుకు నచ్చేయడం.. ఆయన ఓకే చెప్పేయడం చకచకా జరిగిపోయాయి. డీవీవీ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుందంటున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇప్పటి వరకు త్రినాథరావుతో జర్నీ చేసిన రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ ఇప్పుడు ఆయనతో లేరు.
ఇప్పటి వరకు త్రినాథరావు సినిమాలకు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగులు అన్నీ ప్రసన్నే ఇచ్చేవాడు. ధమకాకు కూడా ప్రసన్నే అన్నీ చేశారు. ఇప్పుడు ప్రసన్న డైరెక్షన్ చేపట్టబోతున్నాడు. అదీ నాగార్జున సినిమాకు.. అన్నీ ఓకే అయిపోయాయి. అయితే ఇప్పుడు ప్రసన్న లేకుండా చిరు త్రినాథరావుతో సినిమా చేస్తారా ? అన్న డౌట్ పట్టుకుంది. ప్రసన్న టాలెంట్ ఏంటో ఇండస్ట్రీలో అందరికి తెలుసు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ఇష్యూతో చిరు – నాగ్ మధ్య కొత్త పంచాయితీ మొదలయ్యేలా ఉంది. ప్రసన్నతో నాగ్ చేసేది ఆయన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 99వ ప్రాజెక్ట్. ఇప్పుడు ప్రసన్నను వదులుకునేందుకు నాగ్ ఇష్టపడడంటున్నారు. అటు ప్రసన్న లేకుండా త్రినాథరావుతో చిరు సినిమా చేయకపోవచ్చు. ఈ సందేహాల నేపథ్యంలో ఈ సారి నాగ్ వెనక్కు తగ్గుతాడా ? లేదా ? చిరు వెనక్కు తగ్గుతాడా ? అన్న సందేహాలకు త్వరలోనే క్లారిటీ రానుంది.