హీరోయిన్ అంటే మిస్ ఇండియాలాగా అన్నీ కొలతలు సరిగ్గా ఉండాలని కోరుకుంటారు మన దర్శక నిర్మాతలు. ఇది ఇప్పటి తరం హీరోయిన్స్ గురించి మన మేకర్స్ ఆలోచిసున్నది కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఉన్నదే. ఆ తర్వాత విజయశాంతి, సుహాసినిల జనరేషన్ నుంచీ కంటిన్యూ అవుతోంది. హీరోలు ఎంత లావుగా ఉన్నా ఇబ్బంది ఉండదు. వాళ్ల పక్కన చేసే హీరోయిన్లు మాత్రం చాలా నాజూగ్గా, సన్నగా ఉండాలి.
అప్పట్లో విజయశాంతి, సుమలత, సుహాసిని, భానుప్రియ, మాధవి ఇలాంటి నాజూకైన ఫిజిక్ మేయిన్‌టైన్ చేసిన వారే. రాధిక, రాధ లాంటి ఇద్దరు ముగ్గురు హీరోయిన్సే బొద్దుగా ఉండేవారు. ఇక ఆ తర్వాత జనరేషన్ హీరోయిన్స్ కూడా స్లిం ఫిజిక్ మేయిన్‌టైన్ చేసిన వారే. ఇలా హీరోయిన్ బక్కపలుచని ఫిజిక్‌తో ఉంటే హీరోలకి అన్ని రకాలుగా సుఖంగా ఉంటుంది.
మన దర్శకరచయితలు సన్నివేశాలు రాసేటప్పుడు హీరోతో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండేలా చూస్తారు. అలాగే హీరో హీరోయిన్‌ను ఎత్తుకునే సీన్స్, పైన పడుకోబెట్టుకునే సీన్స్, బెడ్రూంలో ఒళ్ళో కూర్చోబెట్టుకునే సన్నివేశాలు లాంటివి రాస్తుంటారు. ఇక సాంగ్స్‌లో అయితే, ఇలాంటి మోత సన్నివేశాలు చాలా ఉంటాయి. హీరోలు ఎలాగూ కాస్త పర్సనాలిటీతోనే ఉంటారు.
హీరోయిన్లు కూడా బొద్దుగా ఉంటే సాంగ్స్‌తో పాటు రొమాన్స్ చేసేటప్పుడు హీరోల పక్కన ఎబ్బెట్టుగా ఉంటుంది. అదే హీరోయిన్లు బక్కపల్చగా ఉంటే అలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే మన హీరోలు హీరోయిన్‌ను ఎత్తుకోవాలంటే అంత బరువును మోయాల్సి ఉంటుంది. టేక్ ఒకే కాకపోతే కొన్నిసార్లు హీరో హీరోయిన్‌ను ఎత్తుకునే సీన్స్‌లో పైన పడుకోబెట్టుకునే సీన్స్‌లో అల్లాడిపోతుంటారు.
అందుకే, ఎక్కువగా సన్నగా నాజూకుగా ఉండే అమ్మాయినే హీరోయిన్‌గా మేకర్స్ ఆడిషన్ చేసి ఎంచుకుంటునారు. ఇలా ఉండటం వల్ల ప్రేక్షకులు ఇష్టపడతారు. అన్ని రకాలుగా మేకర్స్‌కి ఉపయోగపడతారు.