సినీ ప్రియులకు ఇది నిజంగా బాడ్ న్యూస్ అనే చెప్పాలి . అందాల ముద్దుగుమ్మ సీనియర్ స్టార్ హీరోయిన్ జమున కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆమె వయసు 86 . గత కొన్ని సంవత్సరాలుగా పలు అనారోగ్య సమస్యల కారణంగా బాధపడుతున్న జమున కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోనే తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దీంతో జమున ఫాన్స్ ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు . జమున మన మధ్య ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు .
మరీ ముఖ్యంగా ఒకానొక టైంలో జమున సినీ ఇండస్ట్రీని ఏలేసింది . అప్పట్లో ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా పాపులారిటీ సంపాదించుకున్నారు ..అదేవిధంగా మహానటి సావిత్రి జమున ఇండస్ట్రీని ఏలేశారు . కాగా అప్పటి స్టార్ హీరోయిన్స్‌లలో జమున నెంబర్ వన్ గా రాణించారు. ఎన్టీఆర్ – ఏఎన్నార్ శకం మొదలయ్యాక స్టార్ హీరోయిన్స్ అంటే అందరికీ మొదటిగా గుర్తుచే పేరు సావిత్రి ఆ తర్వాత జముననే. ఒకానొక టైంలో స్టార్ హీరోలకి మించిన రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుని ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
అగ్ర హీరోయిన్గా వెలుగు వెలుగుతున్న టైం లోనే జమున ఓ స్టార్ హీరో ప్రేమలో పడింది . అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది . ఆ హీరో మరెవరో కాదు హరనాథ్ . తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆకట్టుకున్న హరినాథ్ గురించి అప్పట్లో చాలా వార్తలు వైరల్ అయ్యాయి. కేవలం జమునతోనే కాదు చాలామంది హీరోయిన్స్ తో అఫైర్ నడిపిన వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి .
కాగా ఇదే క్రమంలో జమున మంచి కోరుకునే ఎస్వీ రంగారావు జమున గురించి ఈ విషయం తెలిసి హెచ్చరించారట. హరినాథ్ పేరు ఎత్తకుండానే “నువ్వు చేసే పనులు మంచివి కాదు ..నువ్వు మంచి అనుకుంటున్న వాడు మంచివాడు కాదు .. నీ జీవితం నాశనం చేసుకోకు.. నా మాట విని మంచిగా లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి “అంటూ ఆమెకు పరోక్షంగా వార్న్ చేశారట .
ఈ క్రమంలోనే పరిస్థితి అర్థం చేసుకున్న జమున ..హరినాథ్ పై ఉన్న ప్రేమను చంపుకొని అతగాడికి దూరమైందని ఇండస్ట్రీలో టాక్ ఉంది . ఇక తర్వాత జమున 1965లో జూలూరి రమణారావు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది . అప్పట్లో జమున హరినాథ్ రావు మర్చిపోవడానికి చాలా ట్రై చేసిందట ..ఎన్నో నిద్రలేని రాత్రులను కుమిలి కుమిలి ఏడ్చిందట..!!