ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించినవారిలో కేఆర్ విజయ కూడా ఒకరు. నటి కేఆర్ విజయ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో స్టార్ హీరోలకు జోడీగా నటించారు. కేవలం హీరోయిన్ గానే కాకుండా ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించి తన నటనతో మెప్పించారు. ఇప్పుడు కూడా ఆమెను అభిమానించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే విజయ ఎక్కువగా తమిళ సినిమాలలో నటించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ విజయ ను టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేశారు.
నిజానికి విజయ అసలు పేరు దైవనాయననకి కాగా ఆమె తండ్రి పేరు రామచంద్ర ఆయన తెలుగు వారే కూడా. ఇక విజయ తల్లి కేరళకు చెందిన వారు. విజయ చిన్ననాటి నుండే నాటకాల్లో నటించారు. నాటకాల్లో ఉన్న అనుభవం తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటగా కర్పగమ్ అనే సినిమాతో విజయ తమిళ చిత్రపరిశ్రమకు పరిచయ అయ్యారు. అంతే కాకుండా టాలీవుడ్ లో ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో నటించారు.
భక్తిరస చిత్రాల్లో అమ్మవారి పాత్రలు వేయాలంటే అప్పట్లో కేఆర్. విజయే పెట్టింది పేరు. ఇక విజయ సినిమాల్లో నటిస్తున్న సమయంలో తమిళ దర్శకనిర్మాత సుదర్శన్ వేలాయుధంను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకున్న విషయాన్ని మాత్రం వీరు చాలా కాలం వరకూ బయటపెట్టలేదు. దానికి కారణం అప్పుడు విజయ వయసు కేవలం పదిహేడేళ్లే దాంతో మైనర్ కావడం వల్ల పెళ్లి విషయాన్ని దాచిపెట్టారు.
అయితే వేలాయుధమ్ ఓసారి తన సొంత విమానంలో విజయను టూర్ కు తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. ఇక ఆ ఫోటోలు కాస్తా మరుసటి రోజు పత్రికల్లో వచ్చాయి. దాంతో ఇద్దరి రిలేషన్ షిప్ విషయం బయటపడింది. ఇక పెళ్లి తరవాత కూడా భర్త ప్రోత్సాహం తో కేఆర్ విజయ సినిమాలలో నటించింది. ఇక ప్రస్తుతం విజయ సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇక ఆమెకు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి.