తెలుగులోనే కాదు తమిళం సహా ఇతర భాషల్లోనూ అమ్మ పాత్రలు పోషించిన నటి సుధ. ప్రస్తుతం అవకాశం వస్తే.. అంటే వస్తున్నాయి. కానీ, అమ్మ కు సరైన నిర్వచనం చెప్పగలిగే పాత్రలువస్తే.. మాత్రమే చేస్తున్నారు. ఆమె 30 ఏళ్ళ కిందట కెరీర్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 800 సినిమాలకు పైగానే నటించారు. స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించారు. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాయించుకున్నారు.
అయితే, ఇటీవల కాలంలో ఆమె సినిమాలను బాగా తగ్గించేసుకున్నారు. దీనికి కారణం.. అమ్మ పాత్రలతో నూ బూతు పదాలు పలికిస్తున్నారనేది ఆమె ఆవేదన. దీంతో చాలా వరకు సినిమాలు తగ్గిపోయాయి. ఇక, ఆర్థికంగా ఆమె పరిస్థితి బాగానే ఉంది. అయితే.. కొందరు అనుకున్న వ్యక్తులే తనను మోసం చేశారని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. కొన్ని కుటుంబ సమస్యల వల్ల తాను చెన్నైకి రావలసి వచ్చిందని చెప్పారు.
ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో అమ్మ పాత్ర అనగానే ఠక్కున గుర్తుకు వస్తున్నారు సుధ. కానీ, అన్నిసినిమాల్లోనూ ఆమె యాక్ట్ చేయడం లేదు. నిజానికి ఆదిలో హీరోయిన్‌గానే ఆమె అరంగేట్రం చేశారు. అయితే.. రెండు సినిమాల్లో నటించినా ఆమె ఫెయిలయ్యారు. దీంతో వెనక్కి వెళ్లిపోవాలని కూడా అనుకున్నారు. ఈ క్రమంలో దర్శక దిగ్గజం బాలచందర్ సూచనల మేరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రయాణం మొదలు పెట్టారు.
ఇది సక్సస్ అయింది. దీంతో అప్పటి నుంచి అమ్మ పాత్రల్లో నటిస్తూ.. హిట్స్ సంపాయించారు. అంతే కాకండా తనకంటే వయస్సులో పెద్ద వాళ్లు అయిన స్టార్లకు కూడా సుధ అమ్మగా నటించింది. నువ్వునాకు నచ్చావ్ సినిమాలో వెంకీకి అత్తగా, మన్మథుడు సినిమాలో నాగార్జునకు పిన్నిగా కూడా చేసి మెప్పించింది.
ఇక సీనియర్ ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఆయనకు కూతురుగా నటించడం తన కెరీర్‌లో మెమరబుల్ మూమెంట్ అని ఆమె చెపుతూ ఉంటారు. ఆ సినిమా షూటింగ్ టైంలోనే మంచు మనోజ్ ( ఆ సినిమా నిర్మాత మోహన్‌బాబు) సెట్లోకి వచ్చి అల్లరి చేస్తూ సుధను చూసి నా మమ్మీ నా మమ్మీ అనేవారట. సుధ భోజనం పెడితేనే మనోజ్ ఏడుపు ఆపేవాడట. ఈ విషయాన్ని ఆమే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.