ఎస్ ..ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉందా అంటే అవునని అంటున్నారు కోలీవుడ్ మీడియా. మనకు తెలిసిందే బిచ్చగాడు సినిమాతో తెలుగులోను పాపులారిటీ సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ రీసెంట్గా బిచ్చగాడు 2 సినిమా షూటింగ్లో గాయపడ్డాడు .
బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు . అంతేకాదు ప్రస్తుతం మలేషియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైంలో ఊహించిన విధంగా ప్రమాదం జరిగింది . విజయ్ పయనిస్తున్న మరో షిప్ ని ప్రమాదవశాత్తు మరో షిప్ ఢీకొనింది . ఈ క్రమంలోనే తీవ్ర గాయాలు పాలైన విజయ్ ఆంటోనీ దగ్గరలోని మలేషియా హాస్పిటల్లో జాయిన్ చేశారు . కాగా ఇప్పటికీ ఫేస్ సర్జరీ కంప్లీట్ అయిందని .. త్వరలోనే మరో సర్జరీ కూడా ఉంది అంటూ తెలుస్తుంది .
అయితే విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలు అయిన కారణంగా ఆయన ముఖం బాగా మారిపోయిందని తెలుస్తుంది . అంతేకాదు హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉంది అంటూ పలు న్యూస్ లు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే విజయ్ ఆంటోని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు సందేశాన్ని పంపించాడు . నా హెల్త్ కండిషన్ బాగుందని త్వరలోనే మీతో మాట్లాడతానని చెప్పుతూ ధంబ్ సింబల్ ని చూపించాడు . అయితే విజయ్ ఫేస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి .
విజయ్ ఆంటోని హెల్త్ ఇంకా క్రిటికల్ గానే ఉందని.. అందుకే ఆయన ముఖం చూపించలేదని ..చిత్ర బృందమే బలవంతంగా ఆయనతో ఈ మెసేజ్ పెట్టించిందని .. సినిమాకు ఎక్కడ నెగటివ్ టాక్ వస్తుందో అని భయపడి ఇలా చేయించారంటూ మండిపడుతున్నారు . ఏది ఏమైనా సరే విజయ్ ఆంటోని సెల్ఫ్ వీడియో తీసుకొని తన ఆరోగ్యం పై క్లారిటీ ఇస్తే జనాలకు కొంచెం ఉపశమనం కలిగించినట్లు ఉంటుంది అంటున్నారు అభిమానులు..!!