ఒకప్పటి హీరోయిన్ తర్వాత.. అతి తక్కువ కాలంలో సెకండ్ హీరోయిన్‌గా మారి తన కంటూ ప్రేక్షకులను ఏర్పాటు చేసుకున్న నటి షావుకారు జానకి. సావుకారు సినిమాలో తొలి అరంగేట్రం అనుకునే వారు.. చాలా మంది ఉన్నారు. కానీ, అంతకు ముందే.. చిన్న చిన్న పాత్రలు ధరించారు. అయితే.. షావుకారు.. సినిమాలో అన్నగారు ఎన్టీఆర్ సరసన నటించిన ఆమె.. తన నట విశ్వరూపం చూపించారు. దీంతో వాస్తవానికి ఈ సినిమాలో అన్నగారి కంటే కూడా జానకికి ఎక్కువగా పేరు వచ్చింది.
ఇక, అప్పటి నుంచి షావుకారు జానకిగా పేరు స్తిరపడిపోయింది. ఇక, కొన్నాళ్లు హీరోయిన్‌గా నటించినా.. అప్పటికి సావిత్రి, అంజలీదేవి, కన్నాంబ వంటి ప్రముఖ నటీమణులతో పోటీ పడలేక పోయిన సందర్భాలు వచ్చాయి. దీంతో ఒక దర్శకుడి సూచనల మేరకు.. జానకి.. సెకండ్ హీరోయిన్ పాత్రలు వేసింది. డాక్టర్ చక్రవర్తి సినిమాలో అక్కినేని భార్యగా నటించి.. అందరినీ ఆకట్టుకుంది.
అసలు సినిమాలో సావిత్రి హీరోయిన్ అయినప్పటికీ.. కథ మొత్తం జానకి చుట్టూ తిరుగుతుంది. ఆమె డైలాగ్ డెలివరీ సహా నటన అద్భుతంగా ఉంటుంది. ఇక, తర్వాత కాలంలో క్యారెక్టర్ నటీమణిగా మిగిలిపోయింది. అయినప్పటికీ.. జానకి.. దూకుడు అలా ఇలా ఉండేది కాదు. హీరోయిన్లతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేవారట. జానకిది.. మధ్యతరగతి కుటుంబం. ఇంట్లో వారికి ఆర్థికంగా కూడా సాయం చేయాల్సి వచ్చేదట.
దీంతో రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా రాజీపడేది కాదు. పైగా.. హీరోయిన్ తో సమానంగా నీకెందుకమ్మా! అని ఎవరైనా అంటే.. నేను హీరోయిన్‌గా చెయ్యనని చెప్పానా? కావాలంటే హీరోయిన్‌గానే బుక్ చేసుకోండి! అని గడుసుగా వ్యాఖ్యానించేవారట. అయితే.. జానకికి మహిళల్లో ఉన్న ఫాలోయింగ్‌ను గుర్తించిన దర్శక నిర్మాతలు.. అంత మొత్తం ఇచ్చి తీసుకునేవారట.
ఆమె.. క్యారెక్టర్ పాత్రల్లో నటించినా.. కూడా కథంతా కూడాఆమె చుట్టూ తిరిగిన చిత్రాలు ఉన్నాయి. సంసారం ఒక చదరంగం, తాయారమ్మ, బంగారయ్య వంటి సినిమాలు ఇప్పటికీ.. మహిళలు మెచ్చిన సినిమాలుగా రికార్డు సృష్టించాయి.