Moviesవాల్తేరు వీరయ్య పబ్లిక్ టాక్: సినిమా హిట్టే..కానీ, అది మాత్రం ఎక్స్...

వాల్తేరు వీరయ్య పబ్లిక్ టాక్: సినిమా హిట్టే..కానీ, అది మాత్రం ఎక్స్ పెక్ట్ చేయ్యదు రా అబ్బాయిలు..!!

కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన వాల్తేరు వీరయ్య సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ..హ్యూజ్ పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది . మనకు తెలిసిందే ఈ సంక్రాంతి బరిలో నందమూరి బాలయ్య – మెగాస్టార్ చిరంజీవి టఫ్ ఫైట్ ఇచ్చుకున్నారు. నిన్ననే బాలయ్య వీర సిమ్హా రెడ్డి సినిమా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. కొద్దిసేపటి క్రితమే వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

సైలెంట్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా మెగా ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి ఇచ్చిన మాస్ పెర్ఫార్మెన్స్ అభిమానులను 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లి..పాత చిరంజీవిని గుర్తు చేసుకున్నారు . అంతే కాదు ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . ఈ సినిమాల్లో హీరోయిన్స్ గా నటించిన కేథరిన్ , శృతిహాసన్ కూడా బాగా డిజైన్ చేశాడు బాబి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే చిరంజీవి ముందుగానే చెప్పినట్లు ఈ సినిమాలో కొత్తదనం లేదు .

కానీ తనలోని జిముక్కులను అటాచ్ చేస్తూ బాబీ చిరంజీవిలోని మాస్ యాంగిల్ ని వాడుకుంటూ ఆయనలోని ఆ స్పెషల్ క్వాలిటీని బయటకు తీసుకొచ్చాడు . బాబి ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి . అయితే కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిరంజీవిని హైలెట్ చేస్తూ ఆయనే వన్ మాన్ ఆర్మీలా ఈ సినిమా కోసం కష్టపడినట్లు తెలుస్తుంది .

సినిమాలో మాస్ రేంజ్ ని కొంచెం తగ్గించి చిరంజీవి లోని క్లాస్ కూడా టచ్ చేసి ఉంటే సినిమా మరో రేంజ్కి వెళ్ళిపోయిండేది అనేది మెగా ఫ్యాన్స్ అభిప్రాయం. ఒక్క ముక్కలో చెప్పాలంటే చిరంజీవి కోసం ..చిరంజీవిలోని మాస్ యాంగిల్ పర్ఫామెన్స్ కోసం ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు . కొత్తదనంగా ఉండాలి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే జనాలు కచ్చితంగా బోర్ గా ఫీల్ అవుతారు. చూద్దాం మరి వాల్తేరు వీరయ్య మొదటి రోజు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news