కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు . ఒళ్లంతా గాయాలతో ఆయన ఎమర్జెన్సీ కండిషన్ మీద హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అభిమానుల్లో టెన్షన్ నెలకొంది . కాగా బిచ్చగాడు సినిమాతో ఓవర్ నైట్ లో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ అంటోనీ ..ప్రజెంట్ బిచ్చగాడు 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మలేషియాలో జరుగుతున్న షూటింగ్లో బిజీగా ఉన్నా విజయ్..బోట్ ప్రమాదానికి గురైన్నట్లు తెలుస్తుంది.
ఈ షూటింగ్ జరుగుతుండగా విజయ్ ఆంటోనికి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఆయన పయనిస్తున్న బోట్ ఒక్కసారి గా అదుపు తప్పి వేరే బోట్ ని ఢీ కొట్టడంతో ..విజయ్ పడిపోవడంతో హుటాహుటిన దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం విజయ్ కండిషన్ స్టేబుల్ గా ఉన్న 24 గంటలు గడిస్తే గాని ఏం చెప్పలేం అంటూ మలేషియన్ డాక్టర్లు చెప్పుకొచ్చారట .
అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న విజయ్ ఆంటోనీ కుటుంబం ఈరోజు రాత్రి మలేషియా కు పయనం కాబోతున్నట్లు తమిళ వర్గాలు చెబుతున్నాయి . బోట్లో ఓ సన్నివేశం చిత్రికరిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు కోలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తుంది . విజయ్ బోట్లో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన వేరే పడవలో కెమెరా ఇతర సిబ్బంది చిత్రీకరిస్తున్నారట దీంతోవేగంగా ప్రయాణిస్తున్న పడవ అదుపు తప్పి మరో పడవను ఢీకొట్టడం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది . చిత్ర మేకర్స్ తీసుకున్న నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిన్నట్లు తెలుస్తుంది. దీంతో బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు . దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..!!