టాలీవుడ్ సర్కిళ్లలో ఇప్పుడు సంక్రాంతికి వస్తోన్న బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాల చర్చే ప్రధానంగా నడుస్తోంది. రెండు మైత్రీ వాళ్లవే. ఇద్దరూ పెద్ద హీరోలు.. రెండూ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఏ సినిమాకు రిలీజ్ ముందు డామినేషన్ ఉంది ? ఏ సినిమాపై అంచనాలు ఏంటి ? ఎవరి సత్తా ఎందన్నదానిమీదే ఇప్పుడు హాట్ హాట్‌గా డిస్కర్షన్లు నడుస్తున్నాయి.
బాలయ్య వీరసింహాకు రు. 100 కోట్ల బడ్జెట్ అయ్యిందంటున్నారు. దర్శకుడు మలినేని గోపీచంద్ భారీగా ఖర్చు పెట్టించేశారని.. అఖండ వసూళ్లు చూసుకుని.. ఇటు అన్‌స్టాపబుల్ క్రేజ్ చూసుకుని దర్శకుడు ఎక్కువ వర్కింగ్ డేస్ పని చేయించడంతో బడ్జెట్ కంట్రోల్ తప్పిందంటున్నారు. అయితే బాలయ్య గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంత క్రేజ్‌తో ఉన్నాడు. పైగా ఇప్పటికే రిలీజ్ అయిన అన్నీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.
థమన్ బీజీఎం అఖండ రేంజ్‌లో మోత మోగించేశాడంటున్నారు. అయితే మార్కెట్ కూడా అదే రేంజ్‌లో చేశారంటున్నారు. ఇక చిరు వాల్తేరు వీరయ్య ఖర్చు కూడా తడిసి మోపెడు అయ్యిందట. ఈ సినిమాకే వడ్డీలు కూడా ఎక్కువే అయ్యాయంటున్నారు. వర్కింగ్ డేస్, పోస్ట్ ప్రొడక్షన్ కంటే రెమ్యునరేషన్లు బాగా మింగేశాయంటున్నారు. రవితేజ, చిరుతో పాటు టెక్నికల్ టీం అంతా పేరున్న వాళ్లే కావడంతో వాళ్లకే భారీగా రెమ్యునరేషన్ల రూపంలో వెళ్లిపోయిందంటున్నారు.
అయితే ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు ఒకే టైంలో రావడంతో డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి వచ్చే అడ్వాన్స్‌ల్లో కోత ఉందని.. అది వీరయ్యపైనే గట్టిగా ప్రభావం చూపించిందని తెలుస్తోంది. నైజాంలో రెండు సినిమాలు రు. 40 కోట్లు రాబట్టాలి. ఇక రెండు సినిమాల నాన్ థియేటర్ హక్కులను మైత్రీ వాళ్లు ఎప్పుడో అమ్మేశారు. ఇటు ఏపీలోనూ రు. 40 కోట్లకు కాస్త అటూ ఇటూగా రాబట్టాల్సి ఉంది.
అయితే చాలా చోట్ల అడ్వాన్స్‌లు మాత్రం బాలయ్య సినిమాకే ఎక్కువుగా వస్తున్నాయి. సీడెడ్, కృష్ణా, గుంటూరులో వీరసింహాకు, గోదావరి, నైజాంలో చిరు సినిమాకు ఎక్కువ అడ్వాన్స్‌లు అంటున్నారు. పైగా చిరు సినిమాలకు రిలీజ్‌కు ముందు మంచి హైప్ వస్తోంది. అయితే రిలీజ్ తర్వాత సినిమాలు చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. ఇటు బాలయ్య సినిమాలకు ఇంట్రస్ట్ ఎక్కువుగా ఉందని అంటున్నారు. ఎన్ని అంచనాలు ఉన్నా రేపు రెండు సినిమాలు థియేటర్లలో పడే వరకు ఎవరి ఫేట్ ఎలా ఉందో తెలియదు.