గత ఆరు నెలలుగా బాలయ్య వీర సింహారెడ్డి – చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలలో ఎవరు ? సంక్రాంతి విన్నర్ అవుతారంటూ తెలుగు మీడియాలను.. సోషల్ మీడియాలోనూ ఒక్కటే వార్తలు వైరల్ అయ్యాయి. గురువారం బాలయ్య వీర సింహారెడ్డి థియేటర్లలోకి వచ్చింది. ఈ రోజు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ అయింది. దీంతో సహజంగానే ఈ రెండు సినిమాలలో ఏ హీరో సినిమా పై చేయి సాధించింది ? ఎవరు ఈ సంక్రాంతి విన్నర్ అవుతారు ? అన్నదానిపై రకరకాల చర్చలు మొదలవుతాయి.
వీరసింహారెడ్డి సినిమాకు మాస్ సినిమాగా టాక్ వచ్చింది. వీర సింహారెడ్డి సినిమాలో యాక్షన్ తో పాటు సెకండాఫ్ లో సిస్టర్ సెంటిమెంట్ జోడించారు కంప్లీట్ గా బాలయ్య వీరాభిమానులతో పాటు బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను మెప్పించే సినిమాగా వీరసింహారెడ్డికి ప్రతి ఒక్కరు తీర్పు కట్టబెట్టేశారు. అయితే బాలయ్య అద్భుతమైన నటనతో పాటు పాటలు, నేపథ్య సంగీతం వీర సింహారెడ్డి క్యారెక్టర్, అదిరిపోయే పంచ్ డైలాగులు ఇవన్నీ సినిమాను నిలబెట్టేసాయి. ఫైనల్ చెప్పాలంటే వీరసింహారెడ్డి రొటీన్ యాక్షన్ డ్రామా అని తేల్చేశారు.
ఇక ఈరోజు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా కూడా పరమ రొటీన్ స్టోరీ తో తెరకెక్కింది. అయితే వీర సింహారెడ్డి సినిమాలో మిస్సయిన ఎంటర్టైన్మెంట్ వాల్తేరు వీరయ్య లో ఉంది. బాబి ఒక పాత కథకు పాత చింతకాయ పచ్చడి కథనంతో సినిమా తీసినా సినిమాలో చిరంజీవిని బాగా ఉపయోగించుకుని ఎంటర్టైన్మెంట్ సీన్లు రాసుకోవడం.. సెకండ్ హాఫ్ లో మాస్ మహారాజా రవితేజ పాత్ర కథలో కీలకం కావడంతో సినిమా కాస్త ఎంగేజ్ చేసింది.
వీరసింహారెడ్డి డైరెక్టర్ మలినేని గోపీచంద్ అయినా, వీరయ్య డైరెక్టర్ బాబి తీసిన సినిమాలు చూసినా కూడా ఎంత రొటీన్‌గా ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు సినిమాలను కూడా అంతే రొటీన్‌గా లాగేశారు. రెండు సినిమాలు కీన్గా అబర్జ్ చేస్తే ఏదీ కొత్తగా ఉండదు. వీరసింహా మరీ మాస్ సినిమాగా ఉంటే.. వీరయ్యలో చిరు పాత్ర ఊరమాస్‌గా ఉంటుంది. రెండు సినిమాలు మాస్‌ను నమ్ముకుని తీసినవే.
రెండు సినిమాల్లోనూ హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. వీరసింహాలో సిస్టర్ సెంటిమెంట్, వీరయ్యలో తమ్ముడు సెంటిమెంట్ సెకండాఫ్‌లో కీలకం అయ్యాయి. వీరసింహాకు యాక్షన్, పాటలు, నేపథ్య సంగీతం ప్లస్… వీరయ్యకు రవితేజ బాగా ప్లస్. దాదాపు రెండు సినిమాలు ఒకే టాక్‌తో స్టార్ట్ అయ్యాయి. అయితే పండగ తర్వాత ఏ సినిమా నిలబడుతుంది ? ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తాయన్నదానిమీదే సంక్రాంతి విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఒకవేళ రెండు సినిమాలు శాతకర్ణి, ఖైదీ 150 లా బ్యాలెన్స్డ్గా వెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయి.