సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందుకున్న సరే మనం చేయాలి అని అనుకోని చేయలేక ఆగిపోయిన ఆఫర్లు .. పక్కవాళ్ళు చేసి హిట్ కొడితే ఆ బాధ వర్ణాతీతం . అలాంటి బాధను ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ హీరోయిన్స్ ఎంతోమంది అనుభవించి ఉంటారు . కాగా రీసెంట్గా అలాంటి ఓ సిచువేషన్ ని ఫేస్ చేస్తుంది టాలీవుడ్ టాలెస్ట్ బ్యూటీ అనుష్క శెట్టి . టాలీవుడ్ నందమూరి నట్ సిం హం బాలయ్య రీసెంట్ గా హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి .
సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హ్యుజ్ పాజిటివ్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్లు గా స్టార్ డాటర్ శృతిహాసన్ .. మలయాళం బ్యూటీ హనీ రోజ్ నటించారు . అయితే ఈ సినిమాలో శృతి పాత్ర కన్నా.. హనీ రోజ్ పాత్రనే బాగుంది అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో మొదటగా హనీ రోజ్ పాత్రకు అనుకున్న హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ పాత్రకు డైరెక్టర్ మొదట అనుకున్నింది అనుష్క ..కానీ ఈ పాత్రను అనుష్క రీజన్ చెప్పకుండానే.. సున్నితంగానే రిజెక్ట్ చేసిందట . దీంతో ఆ పాత్ర కోసం మలయాళ బ్యూటీ హనీ రోజ్ ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తుంది . ఈ పాత్ర చూసిన జనాలు హనీ నటనకు ఫిదా అయిపోయారు. సినిమా హ్యూజ్ సక్సెస్ అవ్వడం లో హనీ రోజ్ పాత్ర కూడా ఉంది అనడంలో సందేహం లేదు..!!