ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో వచ్చిన చిరు వీరయ్య, బాలయ్య వీరసింహా రెండు సినిమాల్లోనూ శృతీహాసన్ హీరోయిన్‌గా నటించింది. రెండు సినిమాలు సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతున్నాయి. కట్ చేస్తే ఫేడవుట్ అయిపోయిందనుకున్న శృతి ఇప్పుడు ఈ రెండు సినిమాలతో కం బ్యాక్ అయ్యింది. వీరసింహారెడ్డి డైరెక్టర్ మలినేని గోపీచంద్ వరుసగా తన సినిమాల్లో శృతీహాసన్‌కు ఛాన్సులు ఇస్తు వస్తున్నాడు.
మన గాసిప్ రాయుళ్లకు వీరిద్దరి మధ్య ఏదో ఉందని అంట గట్టేసేందుకు ఇదొక్కటి చాలు.. అయితే వీరసింహారెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ మీదే గోపీచంద్ మాట్లాడుతూ ఐలవ్ యూ శృతీ అని చెప్పాడు. దీంతో గోపీచంద్.. ఇంత పబ్లిక్‌గానే ఆమెకు ఐలవ్ యూ చెప్పాడంటే ఆమెతో లవ్‌లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ఒక్కటే ట్రోలింగ్ మొదలైంది.
బేసిక్‌గా గోపీచంద్ మలినేని ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. ఆయనపై హీరోయిన్ల విషయంలోనూ.. మరెవ్వరి విషయంలోనూ ఎలాంటి కాంట్రవర్సీలు, ఎఫైర్ ఇతరత్రా వార్తలు ఎప్పుడూ లేవు. ఆ తర్వాత శృతి స్టేజ్‌పైన మాట్లాడుతూ తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా అన్నయ్య ఉన్నారంటే అది గోపీయే అని తెలిపింది. ఇక వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ నేపథ్యంలో గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై స్పందించారు.
శృతీతో ఇది నాకు మూడో సినిమా. బలుపు – క్రాక్ తర్వాత ఇప్పుడు వీరసింహారెడ్డి. ఆమె నాకు మంచి స్నేహితురాలు. ఆమె నా ఫ్యామిలీ మెంబర్. మా ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఉంది. శృతి నా వైఫ్‌తో కూడా చాలా క్లోజ్‌గా ఉంటుంది.. నా కొడుకు సాత్విక్ అంటే శృతికి చాలా ఇష్టం. వాడికి చాక్లెట్స్‌తో పాటు గిఫ్ట్‌లు తీసుకు వస్తుందని చెప్పాడు.
తాను తన మాటల్లో తన కన్‌సన్ చూపించాను.. ఆమె తనను అన్నయ్య అని పిలిచింది.. అయితే కొందరు సోషల్ మీడియాలో మాత్రం అది అమ్మాయ్, అబ్బాయ్ మధ్య ఉండే లవ్ అనుకుని పోస్టులు పెట్టారని.. ఇది చూసి తాను నవ్వుకున్నానని గోపీచంద్ చెప్పాడు.