2023 సంక్రాంతి కానుకగా టాలీవుడ్‌లోనే ఇద్దరు సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలయ్య, చిరు సినిమాలు సంక్రాంతి రేసులో పోటీ పడుతున్నాయంటే అసలు బాక్సాఫీస్ దగ్గర రసవత్తర పోరు ఎలా ? ఉంటుందో చెప్పక్కర్లేదు. వీరిద్దరు ఐదేళ్ల క్రితం 2017లో తమ కెరీర్‌లోనే మైల్‌స్టోన్ సినిమాలతో పోటీపడ్డారు. అప్పుడు చిరు కెరీర్ 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యాయి.
ఈ పోరులో ఇద్దరూ విజయం సాధించారు. ఖైదీ నెంబర్ 150 సినిమాకు కలెక్షన్లు ఎక్కువ వచ్చాయి. అయితే ప్రశంసలు, రివార్డులు మాత్రం బాలయ్య శాతకర్ణికే దక్కాయి. అయితే ఈ సారి రెండు సినిమాల విషయంలో కొన్ని సారూప్యతలు ఉన్నాయి. రెండు సినిమాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీదే తెరకెక్కాయి. రెండు సినిమాల్లోనూ శృతీహాసన్ హీరోయిన్. రెండు సినిమాల డైరెక్టర్లు ఆ హీరోల అభిమానులే.
ఇక ఇప్పటికే వీరయ్య నుంచి నాలుగు సాంగ్స్ వచ్చాయి. బాలయ్య వీరసింహా నుంచి మూడు సాంగ్స్ వచ్చాయి. సాంగ్స్ వ్యూస్ పరంగా వీరయ్య డామినేషన్ ఉన్నా.. బయట టోటల్‌గా వీరసింహా మంచి ఆల్బమ్‌గా నిలిచిందని.. వీరయ్య ఆల్బమ్ కంపేరిజన్ చేస్తే తేలిపోయిందనే అంటున్నారు. దేవీశ్రీ వీరయ్య ఆల్బమ్‌కు గట్టి దెబ్బే వేశాడంటున్నారు.
ప్రోమోల నుంచి, పాటల వరకు అన్నింట్లోనూ వీరసింహా ఆధిపత్యం కనపడుతోంది. కంటెంట్ పరంగా వీరసింహాకే మంచి మార్కులు పడుతున్నాయి. అయితే వ్యూస్ పరంగా వీరయ్యే కాస్త ముందున్నాడు. అయితే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్‌ల్లోనూ వీరయ్యతో పోలిస్తే వీరసింహా దుమ్మురేపుపతున్నాడనే చెప్పాలి.. యూఎస్‌లో వీరసింహా 37 లొకేషన్లలో ఇప్పటి వరకు 75 షోలకు 30 వేల డాలర్ల వసూళ్లు రాబట్టింది.
ఇటు వాల్తేరు వీరయ్య 32 లొకేషన్లకు 64 షోలకు 17 వేల డాలర్ల వసూళ్లు రాబట్టింది. అయితే ఓవర్సీస్ క్రేజ్ మాత్రం బాలయ్య సినిమాకే ఎక్కువుగా కనిపిస్తోంది. మరి రిలీజ్ టైంకు పరిస్థితి ఎలా ఉంటుందో ? చూడాలి.