సంక్రాంతికి పోటీ పడుతోన్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండిటిపై భారీ అంచనాలు ఉన్నాయి. వారసుడు ఈ రెండు సినిమాల కంటే ఆలస్యంగా రిలీజ్ అవుతుండడంతో ఫస్ట్ పోటీ ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్యే ఉండనుంది. 12న వీరసింహా, 13న వీరయ్య థియేటర్లలోకి రానున్నాయి.
అయితే ప్రి రిలీజ్ బజ్‌తో పాటు థియేటర్ల కౌంట్, ఓవర్సీస్ బుకింగ్‌ల విషయంలో మాత్రం చిరు సినిమా కంటే బాలయ్య సినిమా ముందు ఉంది. వారం రోజుల ముందే ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అప్పటి నుంచి వీరయ్య కంటే వీరసింహే ముందు ఉంది. వీరసింహా యూఎస్ మార్కెట్లో మాసివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వీరసింహారెడ్డికి రెండు రోజుల ముందే 4 లక్షల డాలర్ల మార్క్ దాటేసింది.
ఈ జోరు ఇలాగే కొనసాగితే వీరసింహా ఫస్ట్ డే షోలు కంప్లీట్ అయ్యే సరికే సులువుగా 1 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేయనుంది. ఇక వీరసింహాకు అక్కడ బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్లు స్టార్ట్ కానున్నాయి. ఇక మరుసటి రోజు వస్తోన్న చీరు వాల్తేరు వీరయ్యకు ఇప్పటి వరకు 3.50 లక్షల డాలర్ల మార్క్ వసూళ్లు దాటాయి. వీరయ్య కూడా వీరసింహాతో పోటీ పడుతున్నా ఒక్క స్టెప్ బాలయ్యే ఉంటున్నాడు.
అయితే బాలయ్య సినిమాకు తెలుగుదేశం పార్టీ సపోర్టర్ల అండదండలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. అందుకే షోలకు షోలు బల్క్ బుకింగ్‌లు భారీగా జరుగుతున్నాయట. అది కూడా వీరసింహాకు బాగా ప్లస్ అవుతోంది. అఖండ సినిమాకు కూడా ఓవర్సీస్లో భారీగా బల్క్ బుకింగ్‌లు జరిగాయి. ఏదేమైనా ప్రి రిలీజ్ బజ్‌లో అయితే వీరసింహా దూసుకుపోతోంది. మరి ఈ సినిమా భవిష్యత్తు ఏంటన్నది కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.