సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రీసెంట్గా రిలీజ్ అయిన రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి . గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా నటించారు . అలాగే బాబి డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించాడు.
రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కాగా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ కి మాత్రం పెద్దగా చెప్పుకో తగ్గ పేరు మాత్రం రాలేదు. కమల్ హాసన్ ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది .
రీసెంట్ గానే బాలకృష్ణ – చిరంజీవి తో సినిమా చేసిన శృతిహాసన్ మంచి టాక్ సంపాదించుకోలేకపోయింది . సినిమా హిట్ అయినా కానీ.. అమ్మడు కంటెంట్ పెద్దగా లేకపోవడంతో జనాలు ఎంకరేజ్ చేయలేదు. ఇలాంటి క్రమంలోనే శృతిహాసన్ .. వీర సింహారెడ్డి-వాల్తేరు వీరయ్య రెమ్యూనరేషన్ డీటైల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అతని సమాచారం ప్రకారం శృతిహాసన్ రెండు సినిమాలకు కలిపి దాదాపు 6 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది . వాల్తేరు వీరయ్య-వీర సిం హా రెడ్డి సినిమాలకు మూడు కోట్లు డిమాండ్ చేసి మరి శృతిహాసన్ తీసుకుందట. రెండు సినిమాలు తనకు ఎంతో నచ్చాయని..ఇష్టపడి సినిమాలు చేసానని శృతి చెప్పుకొచ్చింది..!!