సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని.. తమ బొమ్మను స్క్రీన్ పై చూసుకోవాలి అన్ని.. ఎంతోమంది ముద్దుగుమ్మలకు ఆశగా ఉంటుంది . అయితే అందరూ దానికి తగ్గ ఎఫోర్ట్స్ పెట్టలేరు . సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలంటే ..ఎన్ని కాంప్రమైజ్ లు చేయాలో అందరికీ తెలిసిన విషయమే . అయితే స్టార్ట్ డాటర్లకు అలాంటి కష్టాలు ఏమీ ఉండవు అని అందరూ అనుకుంటూ ఉంటారు . అయితే స్టార్ డాటర్స్ కూడా అలాంటి కష్టాలు పడాలి అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన కామెంట్స్ చేసింది .
మనకు తెలిసిందే శరత్ కుమార్ మొదటి భార్య కూతురుగా వరలక్ష్మి సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలా తక్కువ ..హిట్ కొట్టింది మరీ తక్కువ ..ఈ క్రమంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ రోల్స్ కి చెక్ పెడుతూ..విలన్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీసెంట్గా వీర సింహారెడ్డి సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది .
” సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మీరు ..ఇప్పుడు ఎందుకు విలన్ రోల్స్ చేస్తున్నారు” అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలంటే ..గ్లామరస్ గా ఉండాలని ..ఈ గ్లామరస్ ప్రపంచంలో అదే ఇంపార్టెంట్ గా చూస్తారని ..అలాంటి గ్లామర్ తలనొప్పులు భరించలేక నేను ఇలా ఈ విలన్ రోల్స్ చేసుకున్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోని వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు త్వరలోనే వరలక్ష్మి శరత్ కుమార్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలోను విలన్ పాత్ర పోషిస్తుంది అని ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఒకవేళ నిజంగా ఇది నిజమే అయితే మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ కచ్చితంగా ఈ సినిమాతో మరో హిట్ కొట్టినట్టే అంటున్నారు జనాలు..!!