టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న ..భార్యాభర్తలుగా హ్యాపీగా.. ఫ్యామిలీ లైఫ్ ను కొనసాగిస్తున్న మెగా కోడలు ఉపాసన .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ వేరే , తనకంటే వయసులో పెద్దది అయిన ఉపాసనని పెళ్లి చేసుకున్న రాంచరణ్ ,,పెళ్లయిన మరోక్షణం నుండి ఆమెను పాపల కాపాడుకుంటూ ప్రేమిస్తూ అభినందిస్తున్నాడు, ఇదే విషయాన్ని ఎన్నోసార్లు రామ్ చరణ్ అఫీషియల్ గా కూడా ప్రూవ్ చేశాడు . రీసెంట్ గానే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నామంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు .
కాగా దీంతో రాంచరణ్ ఉపాసనలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . రీసెంట్ గానే సంక్రాంతి సందర్భంగా ఉపాసన తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసి మెగా ఫాన్స్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ క్రమంలోని గతంలో ఉపాసన ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి . గతంలో ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ..” నేను అందరిలాంటి అమ్మాయిననే.. నాకు మూడ్ స్వింగ్స్ అనేటివి ఉంటాయి .. కోపం – బాధ – దుఃఖం అన్నీ వస్తూ ఉంటాయి .
“రామ్ చరణ్ ఎవరితో అయినా షూటింగ్ లొకేషన్లో హీరోయిన్‌తో కొంచెం క్లోజ్ గా మాట్లాడినా..రొమాంటిక్ సీన్స్ చేస్తున్నప్పుడైనా ..నాకు కోపం వస్తుంది . నేను అక్కడ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వను. నాకు తెలుసు అది సినిమా షూటింగ్ అని . కానీ నేను మనిషినే కదా ..ఒక ఆడపిల్లనే కదా ..నాకు కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి ” అంటూ చెప్పుకొచ్చింది . ఇదే క్రమంలో చరణ్ కూడా ఉపాసన కోసం రొమాంటిక్ సీన్స్ లో నటించడం తగ్గించుకున్నాడు అన్న టాక్ కూడా వైరల్ అవుతుంది.