ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో స్పీడ్ గా ఉన్నారో అందరికీ తెలిసిందే. ప్రేమించిన అబ్బాయిలను ఇంట్లో ఒప్పించి ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతకంటే త్వరగా మాతృత్వాన్ని ఎంజాయ్ చేయడానికి తొందర పడుతున్నారు . ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోయిన్స్ పెళ్లికి ముందే కాలు జారుతూ తొందర పడుతుంటే ..మరి కొంతమంది పెళ్లి తర్వాత అఫీషియల్ గా తమ మాతృత్వాన్ని అనౌన్స్ చేస్తున్నారు . రీసెంట్గా అలియాభట్ ప్రెగ్నెన్సీ ఏ రేంజ్ లో హంగామా చేసిందో అందరికీ తెలిసిన విషయమే .
కాగా బాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ తల్లి కాబోతున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కత్రినా కైఫ్ .. స్టార్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . పెళ్ళైన ఏడాది శుభ సందర్భంగా గ్రాండ్గా పార్టీ చేసుకొని ఎంజాయ్ చేశారు . అంతేకాదు ఎప్పటికప్పుడు హనీమూన్లకు ట్రిప్స్ వేస్తూ కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూనే ఫ్యామిలీ పరంగా రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది ఈ జంట . ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ రొమాంటిక్ జంట చేసే రచ్చ అంతా కాదు .
రీసెంట్గా కత్రినా ఫొటోస్ చూసిన జనాలు ఆమె తల్లి కాబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు . ఆమె బేబీ బంప్ ఆ ఫొటోస్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉండడంతో కత్రినా కావాలని తన ప్రేగ్నెన్సీ ని దాచింది అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే దీనిపై కత్రినా ఇప్పటి వరకు ఏ విధంగా స్పందించలేదు . తాజాగా ఆమె ముంబై ఎయిర్పోర్టులో కనిపించిన దృశ్యాలు ఆమె తల్లి కాబోతుంది అన్న వార్తలకు ఆజ్యం పోసినట్లు అయింది .
ఎప్పటిలా కాకుండా లూస్ గా ఉండే దుస్తులను ధరించి కనిపించింది . అంతేకాదు మధ్యలో తన పొట్టను కవర్ చేసుకోవడానికి చేతులను అడ్డుపెట్టుకుంటూ ట్రై చేసింది . ఈ క్రమంలోనే బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తూ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పకనే చెప్పేసింది కత్రినా అంటూ జనాలు చెప్పుకుంటున్నారు . ఇలాంటి మంచి గుడ్ న్యూస్ కత్రినా తన నోటితో చెప్తే వినాలి అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు ..చూద్దాం మరి కత్రినా ఏం చేస్తుందో..?