మురళీమోహన్ – జయసుధ.. ఇద్దరూ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నతస్థాయి నటులు. ఎవరికి వారే పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు కుటుంబ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు మురళీ మోహన్. హీరోగా చేస్తూనే ఎందుకైనా మంచిదని.. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అడుగులు వేశారు. నిజానికి దాసరి నారాయణ రావు సలహాను ఆయన ఎక్కువగా పాటించారు.
దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలనే విషయాన్ని బాగా అవగాహన చేసుకున్న మురళీ మోహన్.. మంచి ఆఫర్లు వస్తున్న సమయంలోనే క్యారెక్టర్‌గా నిలదొక్కుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అందుకే .. మురళీమోహన్ సమకాలికులైన హీరోలతో పోల్చుకుంటే.. ఈయన సంపాయించినంతగా వారు సంపాదించుకోలేక పోయారు. ఈయన వేసిన అడుగులు వారు వేయలేక పోయారు.
ఇప్పటికీ మురళీ మోహన్ అంటే.. ఒక మంచి పేరు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. తర్వాత.. ఆయన రియల్ రంగంలోనూ అద్భుతాలు సృష్టించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇదిలావుంటే.. జయసుధ కూడా.. సూపర్‌గా దూసుకుపో యారు. నిజానికి ఆమె తరంలో జయప్రద, శ్రీదేవి వంటి వారు.. ఉత్తరాదిని ఏలారు. అయితే.. జయసుధ మాత్రం దాసరి నారాయణ రావు సలహాను పాటించారు.
నీకు ఉత్తరాది అచ్చిరాదు.. అని దాసరి చెప్పడంతో ఆయన మాటను తూచ తప్పకుండా పాటించారు. అందుకే జయసుధ ఉత్తరాది బాటపట్టలేదు. ఒకటిరెండు సినిమాలు చేసినా.. అవి విఫలమయ్యాయి. ఇదిలావుంటే.. జయసుధ కూడా రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారు. అయితే.. ఇది కూడా సరికాదని దాసరి చెప్పడంతో ఆమె దానికి కూడా దూరంగా ఉన్నా ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లి సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
చివర్లో దాసరి ఒక స్కూల్ ఏర్పాటు చేసుకోవాలని జయసుధకు చెప్పడంతో ఆదిశగా అడుగులు వేశారు. ఏదేమైనా.. ఈఇద్దరు దాసరి శిష్యులుగా ఆయన మాట విని.. ఆర్థికంగా వ్యక్తిగతంగా ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవితాలను అనుభవిస్తున్నారు. ఇది వీరిద్దరి జీవితాల్లో ఓ కామన్ పాయింట్.