Moviesతారక్ అంటే చచ్చేంత ఇష్టం..కానీ నటించడానికి భయపడుతున్న జాన్వీ..కారణం ఇదే..!!

తారక్ అంటే చచ్చేంత ఇష్టం..కానీ నటించడానికి భయపడుతున్న జాన్వీ..కారణం ఇదే..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ అంటే స్టార్ డాటర్ జాన్వి కపూర్ కి చాలా చాలా ఇష్టం ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో చెబుతూనే వస్తుంది . అయితే ఆమె ఎన్టీఆర్ తర్వాత సినిమా లో నటించడానికి మాత్రం భయపడుతుంది . అందుకే ఆమె వెనకడుగు వేస్తుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే ఆర్ఆర్ఆర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న తర్వాత కొరటాల శివతో సినిమాకి కమిట్ అయ్యాడు . అయితే నిన్నటి వరకు దాని గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వని కొరటాల న్యూ ఇయర్ సందర్భంగా ఫిబ్రవరిలో సినిమా షూట్ ప్రారంభిస్తాం.. 2024 ఏప్రిల్ సినిమా రిలీజ్ చేస్తామంటూ అఫీషియల్ గా ప్రకటించాడు .

రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ అంత హ్యాపీగా లేకపోయినా కనీసం ఇలాంటి అప్డేట్ అయినా ఇచ్చాడు అదే మహా ప్రసాదం అంటూ లైట్ గా తీసుకున్నారు . ఇదే క్రమంలో ఎందుకు కొరటాల శివ హీరోయిన్గా స్టార్ డాటర్ జాన్వి కపూర్ ని పెట్టాలి అనుకుంటున్నాడు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు . దానికి మెయిన్ రీజన్ శ్రీదేవి. శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే . అలాంటి స్టార్ డాటర్ ఎన్టీఆర్ సినిమాతో తెరంగేట్రం చేస్తే ఆమె కెరియర్ బాగుంటుంది. సినిమాకి హైప్ వస్తుంది అన్న స్వార్థంతోనే కొరటాల ఇలా చేస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.

అయితే బోనీకపూర్ మాత్రం జాన్విను.. ఎన్టీఆర్ థర్టీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పరిచయం చేయకూడదని భీష్ముంచుకుని కూర్చున్నాడట . దానికి మెయిన్ రీజన్ రాజమౌళి . మనకు తెలిసిందే ఇండస్ట్రీలో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది . రాజమౌళితో ఏ హీరో సినిమా తీస్తే ఆ తర్వాత పక్కన డైరెక్టర్ తో చేసినప్పుడు కచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇప్పటివరకు ఉన్న ట్రాక్ రికార్డ్ చూస్తే అదే నిజమని చెప్తుంది. అలా చూసుకుంటే ఎన్టీఆర్ 30 కూడా ఫ్లాప్ అవ్వాల్సిందే . మరి తెలిసి తెలిసి కూతూరు జీవితాన్ని ఎవరైనా నాశనం చేస్తారా..? అందుకే ఎన్టీఆర్ 30 విషయంలో బోనీకపూర్ కఠినంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . అయితే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో తన కూతురు సినిమా ఎంట్రీ కచ్చితంగా ఉండాలి అని ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కే సినిమాతో ఎన్టీఆర్ – జాన్వి కాంబో ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి దీనిపై ఎలాంటి అప్డేట్ రిలీజ్ అవుతుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news