తెలుగు సినీ వినీలాకాశంలో తనకంటూ.. ప్రత్యకతను చాటుకున్న మహానటి(ఈ బిరుదు రాకపోయినా).. పురిట్చితలైవి జయలలిత. ఇటు తెలుగులో నటిస్తే.. తెలుగు నటిగా..పేరు తెచ్చుకున్నారు. అటు తమిళం లో నటిస్తే.. తమిళ నటిగా ముద్రవేసుకున్నారు. ఇక,కన్నడలో కనిపిస్తే.. మా ఇంటి నటీమణి అని పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి విలక్షణ నటీమణి.. తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు. అమ్మగా పేరొందారు.
అయితే.. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు.. జయలలిత చుట్టూ ఒక వివాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ల్లో క్యారెక్టర్ పాత్రలు వేసిన జయలలిత వంశీ సినిమాలలో ఎక్కువ నటించేవారు దీంతో చెన్నైలోనే ఎక్కు వగా ఉండేవారు. అయితే.. ఈ క్రమంలో ప్రతిపక్షాలు.. ఏమైనా కామెంట్లు చేయాలంటే.. ఈ జయలలితను అడ్డు పెట్టుకుని.. తీవ్ర విమర్శలు గుప్పించేవారు.
జయలలిత యాక్షన్.. ఎక్స్‌పోజింగ్ వంటి అంశాలను ప్రతిపక్షనాయకుడు మాజీ సీఎం కరుణా నిధి అనుచరులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించేవారు. అయితే.. ఇది తనకు ఇబ్బందిగా ఉండడంతో సీఎంగా ఉన్న జయలలిత.. నటి జయలలితను పేరు మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చేవారట. అయితే.. తాను ఎందుకు మార్చుకోవాలని ఈమె భీష్మించడం.. వివాదాలకు దారితీసింది.
దీంతో అన్నాడీఎంకే కార్యకర్తలు.. అమ్మకే ఎదురు చెబుతావా? అంటూ.. ఇంటి ముందు వివాదాలకు దిగడం.. వంటివి నిత్యం పేపర్లలో వచ్చేవి. ఈ పరిణామం కాస్తా.. నడిగర సంఘం వరకు వెళ్లిందట. చివరకు.. చలపతిరావు సూచనలతో జయలలిత హైదరాబాద్‌కు వచ్చేయడం వరకు ఈవివాదం కొనసాగుతూనే ఉందని జయలలిత ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.