ఈ మధ్యకాలంలో తెరపై లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ..వినిపిస్తున్నాయి. గతంలో ఒకటో రెండో లేడీ ఓరియంటెడ్ సినిమాలు దర్శనమిచ్చేవి.. అవి కూడా ఎప్పటికో ఐదేళ్లకు ఆరేళ్లకు ఓ సినిమా రిలీజ్ అయ్యేది. కానీ ఈ మధ్యకాలంలో ఏడాదికి రెండు మూడు సినిమాలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంటున్నాయి. దీంతో తెర పై లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు హ్యూజ్ డిమాండింగ్ ఏర్పడింది.
అంతెందుకు రీసెంట్ గా సమంత నటించిన యశోద సినిమా లేడీ ఓరియంటెడ్ గా నే తెరకెక్కింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయి పాజిటివ్ కామెంట్స్ సంపాదించుకుంది . ఆ తర్వాత నయనతార నటించిన కనెక్ట్ సినిమా కూడా లేడీ ఓరియంటెడ్ గానే తెరకెక్కింది. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ అందుకుంది. కంటెంట్ అర్ధం కాక..కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఇక అనుపమ పరమేశ్వరన్ లేడీ ఓరియంటెడ్ గా నటించిన సినిమా బటర్ఫ్లై .
ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలా వరుసగా హీరోలతో సంబంధం లేకుండా హీరోయిన్స్ .. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు . త్వరలోనే సమంత హీరోయిన్గా నటించిన “శాకుంతలం” సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూడాలి మరి సమంత ఈ సినిమా ద్వారా తన ఖాతాలో ఎలాంటి హిట్ వేసుకుంటుందో..?