Moviesవీర‌య్య‌, వీర‌సింహా సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇవే..!

వీర‌య్య‌, వీర‌సింహా సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇవే..!

సంక్రాంతికి పోటాపోటీగా వ‌స్తోన్న మెగాస్టార్ వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య వీర‌సింహారెడ్డి రెండు సినిమాల‌ను మైత్రీ మూవీస్ సంస్థ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించింది. ఇక రెండు సినిమాల బ‌డ్జెట్‌, ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఆస‌క్తి రేపుతున్నాయి. బాల‌య్య సినిమాకు రు.100 కోట్ల బ‌డ్జెట్ అయ్యింది. అఖండ వ‌సూళ్లు చూసి కాస్త ఎక్కువే ఖ‌ర్చు పెట్టించాడ‌ట ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని.

ఇక చిరు వాల్తేరు వీర‌య్య‌కు రు. 140 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. కేవ‌లం రెమ్యున‌రేష‌న్ల‌కే వీరయ్య‌కు ఎక్కువ ఖ‌ర్చు అయ్యింది. చిరంజీవి, ర‌వితేజ రెమ్యున‌రేష‌న్లు మాత్ర‌మే రు. 50 కోట్లు దాటేసేశాయంటున్నారు. అదే బాల‌య్య‌కు ఇచ్చిన రెమ్యున‌రేష‌న్ కేవ‌లం రు. 12 కోట్లు మాత్ర‌మే. ఇక రెండు సినిమాల థియేట్రిక‌ల్ మార్కెట్ చూస్తే ఆంధ్రాలో రెండు సినిమాల‌కు క‌లిపి రు. 75 కోట్లు ఫిక్స్ చేశార‌ట‌.

ఇందులో బాల‌య్య సినిమాకు రు. 35 కోట్లు, చిరంజీవి సినిమాకు రు. 40 కోట్ల పై మాటే అంటున్నారు. గోదావ‌రి జిల్లాల‌తో పాటు ఉత్త‌రాంధ్ర‌లో చిరు సినిమాకు కాస్త ఎక్కువ రేట్లు ప‌లికాయి. సీడెడ్‌లో రెండు సినిమాల‌కు రు. 27 కోట్లు పైనే ఫిక్స్ అయ్యింది. అయితే సీడెడ్ వ‌ర‌కు బాల‌య్య ఆధిప‌త్యం స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. ఇక నైజాంలో చిరంజీవి సినిమాకు రు. 18 కోట్లు, బాల‌య్య సినిమాకు రు. 16 కోట్లు అంటున్నారు.

అయితే నైజాంలో గ్యారెంటీ మ‌నీ సిస్ట‌మ్ కింద వీర‌సింహారెడ్డికి రు. 22 కోట్ల వ‌ర‌కు కూడా బిజినెస్ జ‌రిగిన‌ట్టు మ‌రో టాక్ ? ఇక అడ్వాన్స్ సిస్ట‌మ్ మీద విడుద‌ల చేయ‌డంతో ఓవ‌ర్ ప్లోస్ వ‌స్తే కూడా నిర్మాత‌ల‌కు లాభాలు మ‌రింత‌గా పెరుగుతాయి. ఓవ‌రాల్‌గా ఆంధ్రా, సీడెడ్‌, నైజాం క‌లిపి రెండు సినిమాల‌కు రు. 135 కోట్ల రేంజ్‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మ‌రో 10 శాతం అమౌంట్ దీనికి క‌ల‌పాలి. మ‌రి వీర‌య్య విజృంభ‌ణ‌, వీర‌సింహుడి గ‌ర్జ‌న ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news