హీరోయిన్స్ టాలీవుడ్ హీరోలను ప్రేమించి కెరీర్ నాశనం చేసుకుంటున్నారా..? అవుననే మాట ప్రత్యేకంగా వినిపించకపోయినా కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన చాలామంది హీరోయిన్స్‌ను చూస్తే అదే అనిపిస్తుంది. సినిమాలలో హీరోయిన్ అవకాశం కోసమే చాలా ఏళ్ళు ఎదురుచూస్తారు. అవకాశం వచ్చాక సక్సెస్ చూసి కన్నుమిన్ను కానరు. హీరోలతోనే ప్రేమలో పడి ఎటూ కాకుండా ఉండిపోతారు.
టబు :
పక్కా హైదరాబాదీ అయిన టబు ఇంకా పెళ్ళి చేసుకోలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఈమె అప్పట్లో కింగ్ నాగార్జునతో రిలేషన్ షిప్‌లో ఉండటం వల్లే ఇలా పెళ్లి చేసుకోకుండా మిగిలిందనే టాక్ ఇంకా వినిపిస్తోంది. కానీ, ఈ విషయం అటు టబు గానీ, ఇటు నాగార్జున గానీ ఒప్పుకోరు.
అనుష్క శెట్టి :
కింగ్ నాగార్జున – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన యోగా టీచర్ అనుష్క శెట్టి. ఈమె పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ, ఈ విషయంలో ప్రభాస్ – అనుష్క కొట్టిపారేస్తున్నారు. మధ్యలో అనుష్క శెట్టి..కోవెలమూడి ప్రకాష్‌ను పెళ్లి చేసుకుంటుందని, గోపీచంద్‌ని ప్రేమిస్తుందనీ వార్తలు వచ్చాయి. కానీ, ఏది ఎంతవరకూ నిజమో క్లారిటీ లేదు.
రెజీనా కసాండ్ర :
టాలీవుడ్ మెగా హీరో సాయి ధరం తేజ్‌తో రెజీనా లవ్‌లో ఉందనే ప్రచారం జరిగింది. అయితే, రెజీనా వైఖరి బాగోలేక మెగా ఫ్యామిలీ కాదనుకుందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజముందో గానీ..మెగా హీరోలతో సినిమాలు చేసిన రెజీనా ఇప్పుడు అవకాశాల కోసం ఆవురావురంటోంది. ఇలా మన టాలీవుడ్‌లో మాత్రమే కాక సౌత్‌లో చాలామంది హీరోయిన్స్ హీరోలతో ప్రేమలో పడి మంచి కెరీర్‌ను నాశనమ చేసుకున్నారు.