సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్న వాళ్ళలోకి శృతిహాసన్ చాలా ప్రత్యేకం. మల్టీ టాలెంటెడ్ కమల్ హాసన్ కూతురుగా పేరు సంపాదించుకున్న శృతిహాసన్ ..రీసెంట్ గానే రెండు బడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్గా నటించింది శృతిహాసన్ . బాలయ్య సరసన వీరసింహారెడ్డి .. చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్యలో నటించి రెండు బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.
శృతిహాసన్ హాలీవుడ్ మూవీ లోని నటిస్తుంది . శృతిహాసన్ తన అందానికి సీక్రెట్ ఏంటో ఓపెన్ గా చెప్పేసింది . దాని కోసం పెద్దగా ఖర్చులు ఏమి పెట్టను అంటూ తన అందానికి అసలు సీక్రెట్ వంటగదిలోనే ఉంది అంటూ చెప్పుకొచ్చింది . శృతిహాసన్ మాట్లాడుతూ..” వంటగది నా బ్యూటీ పార్లర్ .. జుట్టుకు కొబ్బరినూనె ,బేకింగ్ సోడా కలిపిన పెరుగు , పసుపు , అలోవెరా , టొమాటో , స్ట్రాబెరీ లాంటివి ..ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటాను .
అంతే కాదు తాగడానికి ఎక్కువగా కొబ్బరి నీళ్లనే తీసుకుంటాను . ఎలాంటి క్లైమేట్ లో అయినా సరే కొబ్బరి నీళ్లు మాత్రం మిస్ చేయను.. ఉదయాన్నే అల్పాహారంలో రెండు ఇడ్లీలు కోడిగుడ్డు కంపల్సరీ తీసుకుంటాను . ఒకవేళ మిస్ అయితే కచ్చితంగా ఒక కప్ ఫ్రూట్స్ ఉండేలా చేసుకుంటా మధ్యాహ్నం భోజనం లో అన్నం లేదా పాస్తా, సాయంత్రం ఫ్రూట్ సలాడ్ , వెజిటేబుల్ సలాడ్ .. వీటితో పాటు కొన్ని వ్యాయామాలు చేస్తూ ఉంటాను ” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శృతిహాసన్ బ్యూటీ సీక్రెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!