ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ అందరూ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతూ తమ మ్యారీడ్ లైఫ్ ను స్టార్ట్ చేస్తున్నారు . అందాల ముద్దుగుమ్మలు అలియా, కత్రినా కైఫ్ ,కాజల్ అగర్వాల్ ,ప్రణీత ,నిహారిక ఇలా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హీరోయిన్స్ అందరూ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు . అంతేకాదు రీసెంట్గా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.
నిన్ననే ఆయన నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది . సోషల్ మీడియాలో మరో స్టార్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు తమన్నా. ఎస్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14వ తేదీ ఎంగేజ్మెంట్ జరగబోతుంది .
అంతేకాదు ఏప్రిల్ 21న వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే ఇద్దరు కుటుంబ సభ్యులు వీళ్ల ప్రేమను యాక్సెప్ట్ చేయగా పెళ్లి చేసుకుని వీళ్ళ బంధాన్ని అఫీషియల్ చేయాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారట. ఈ క్రమంలోనే తమన్నా కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!