ఎన్టీఆర్ సినిమాలు అంటే.. తెలుగుకు పెద్దపీట వేస్తారు. తెలుగు యాస, భాష అంటే..అన్నగారికిప్రాణం. ఆయన తెలుగు వాచకం కూడా అంతే సూటిగా ఉంటుంది. ఎక్కడా ఆయన ఒడిదుడుకులకు లోనైంది లేదు. అంతేకాదు.. తెలుగు డైలాగుల్లో ఎక్కడా ఆంగ్లం వచ్చినా.. “ఏవండీ డైరెక్టర్‌గారూ.. తెలుగులో డైలాగులు రాయించండి.. ఇది ఇంగ్లీష్ సినిమా కాదుగా..!“ అని సూటిగా చెప్పేవారట.
అయితే.. దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు వంటివారు మాత్రం అన్నగారికి నచ్చజెప్పి కొన్నికొన్ని డైలాగులను ఇంగ్లీష్‌లోనే పలికించిన సందర్భాలు ఉన్నాయి. ట్రెండ్ మారింది సర్! అని రాఘవేంద్రరావు అంటే.. “అక్కడ అలానే మాట్లాడాలి. లేకపోతే.. కనెక్ట్‌కాదు“ అని దాసరి అనేవారట. సరే.. ఈ విషయం ఇలా ఉంటే.. శ్రీదేవితో అన్నగారు నటించిన సినిమాలు అనేకం ఉన్నాయి.
కూతురు పాత్ర నుంచి హీరోయిన్ పాత్ర వరకు అన్నగారితో శ్రీదేవి కలిసి నటించింది. అయితే.. హీరోయిన్‌గా శ్రీదేవి నటించిన సినిమాలకు.. ఇద్దరూ అంటే.. అన్నగారుశ్రీదేవి కూడా కలిసి డబ్బింగ్ చెప్పాల్సి వచ్చేది. ఈ సందర్భంగా అన్నగారు శ్రీదేవిని ఆటపట్టించేవారట. “ఏంటీ కీచు గొంతు.. “ అని ఏడిపించేవారట.
అంతేకాదు.. “కాస్త కడుపుకు పట్టించు. డైలాగులు బలంగా వస్తాయి. నీమాట నీకైనా వినిపిస్తోందా?“ అని వ్యంగ్యాస్త్రాలు రువ్వేవారట. గత సినిమాలను గమనిస్తే.. శ్రీదేవి వాయిస్ కీచుగా ఉంటుంది. పైగా సన్నగా వినిపిస్తూ ఉంటుంది. దీంతో ఆమెను అన్నగారు ఆటపట్టించడం.. దర్శకులు.. సర్దిచెప్పడం.. కామన్ అయ్యేదట. ఈ విషయంలో శ్రీదేవి -రామారావుల మధ్య ఎప్పుడూ యుద్ధం జరిగేదని అప్పటి టాక్..!