హీరోయిన్‌గా అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తున్న ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్ శ్రీదేవి ఒకవైపు.. అప్పటికే.. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్న చంద్రమోహన్ మరోవైపు. ఇద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా నటిం చిన సినిమా `పదహారేళ్ల వయసు`! నిజానికి ఈ సినిమా కోసం.. అప్పట్లో శోభన్‌బాబును సంప్రదించారని.. ఆయన కూడా ఒప్పుకొన్నారని..అయితే.. సినిమా అంతా శ్రీదేవి చుట్టూ తిరగడంతో.. ఆయన వద్దని తిరస్కరించారని ఒకటాక్ ఉంది.
ఇదిలావుంటే.. ఈ సినిమాలో మొత్తం కథంతా కూడా.. శ్రీదేవి చుట్టూనే తిరుగుతుంది. దీంతో దర్శకుడు రాఘవేంద్రరావు.. శ్రీదేవికి ఇదే విషయం చెప్పారు. ఈ సినిమాతో సూపర్ హిస్టరీ నమోదవుతుందని, నీకు తిరుగు ఉండదని చెప్పారట. దీంతో శ్రీదేవి ఒప్పుకొన్నారు. ఇక, శోభన్ బాబు కాదనడంతో చంద్రమోహన్‌ను సంప్రదించారు. ఆయన ఒప్పేసుకున్నారు. మధ్యలో గోచీ పెట్టుకుని నటించే సీన్‌ను తర్వాత చొప్పించారట.
ముందు చంద్రమోహన్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినా తర్వాత కథ అంతా హీరోయిన్ చుట్టూ తిరుగుతుందని తెలిశాక కాస్త తటపటాయించారట. అయితే దర్శకుడు రాఘవేంద్రరావు ఇచ్చిన భరోసాతో చంద్రమోహన్ ఒప్పుకొన్నారట. ఇదిలావుంటే.. సినిమా సూపర్ హిట్టయింది. అప్పట్లోనే 100 రోజులు 150 రోజులుకూడా ఆడింది. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు సాధించింది.
అయితే.. ఈ సినిమా తర్వాత.. శ్రీదేవి కంటే కూడా చంద్రమోహన్‌కు ఆఫర్లు పెరిగిపోయాయి. అంతేకాదు.. సినిమా మొత్తంలో చంద్రమోహన్‌కే ఎక్కువగా పేరు రావడం గమనార్హం. ఇదే విషయాన్ని శ్రీదేవి చాలా సార్లు రాఘవేంద్రరావును అడగడంతో తర్వాత ఆమెతో సోలో సినిమా చేయాలని అనుకున్నారట. కానీ, కుదరలేదు. ఇదీ.. సంగతి..!