సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి పెద్ద తలనొప్పిగా మారింది. ఏ న్యూస్ నిజం .. ఏ న్యూస్ అబద్ధమో తెలియకుండా సోషల్ మీడియాలో గాసిప్ రాయళ్లు పూటకో వార్త పుట్టిస్తూ స్టార్ సెలబ్రిటీస్ కి నిద్ర పట్టనీకుండా చేస్తున్నారు . కాగా గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న శ్రీముఖి పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే.
బుల్లితెరపై తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బుల్లితెర రాములమ్మ శ్రీముఖి త్వరలోనే స్టార్ సెలబ్రిటీ ఇంటికి కోడలుగా వెళ్లబోతుందని కొందరు ..మరొకరు తన సొంత బావన పెళ్లి చేసుకోబోతుంది.. అంటూ వార్తలు పుట్టించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు వెబ్సైట్లో టెలివిజన్లు శ్రీముఖి పెళ్లి వార్త జోరుగా వైరల్ అయింది. కాగా ఎట్టకేలకు పెళ్లి వార్త శ్రీముఖి స్పందించింది .
“మీకు నచ్చిన వాళ్ళతో నా పెళ్లి చేసేస్తారా..? ఒకసారి బాయ్ ఫ్రెండ్, మరొకసారి బావతో.. ఈసారి ఏకంగా నా తండ్రి ఫోటో నే పెట్టి నాకు పెళ్లి చేస్తారా..?” అసలు ఇలా ఎలా రాయగలరు.. ప్రజెంట్ నేను నా కెరియర్ పై కాన్సెప్ట్రేషన్ చేస్తున్నాను ..నాలుగు ఐదు ఏళ్ల వరకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.. నా పెళ్లి వార్త నేనే స్వయంగా ప్రకటిస్తా.. దయచేసి ఈ చెత్తను తీసేయండి “అంటూ ఘాటుగానే స్పందించింది శ్రీముఖి. ఈ క్రమంలోని శ్రీముఖి పెళ్లి చేసుకుంటుంది అని బాధపడిపోతున్న ఫాన్స్ కు కొంచెం ఉపశమనం లభించింది..!!