అందంగా ఉన్న హీరోయిన్ను ఎలా వాడాలో మన సౌత్ మేకర్స్‌కి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ దర్శకనిర్మాతలకి. మొదటి రెండు సినిమాలతో సక్సెస్ గనక వస్తే ఆ హీరోయిన్ను అందరూ వాడేయాలని గట్టిగా డిసైడయిపోతారు. మరీ ఏజ్ తక్కువ అని కూడా ఆలోచించే స్థాయిలో ఉండరు. ఇందుకు ఉదాహరణ ఆర్తీ అగర్వాల్. హన్షిక మొత్వానీ లాంటి కూర్రభామలే.
ఆర్తీ అగర్వాల్ 20 ఏళ్ళ వయసులోనే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్గా నటించింది. అది ఆర్తికి మొదటి సినిమా. వాస్తవంగా తన ఏజ్‌కి యంగ్ హీరోల సినిమాలనే ఒప్పుకోవాలి. కానీ, చిరంజీవి, నాగార్జున లాంటి మహా ముదురు హీరోలతో రొమాన్స్ చేసింది. చెప్పాలంటే ఈ సీనియర్ హీరోలకి ఆర్తిది కూతురు వయసు. అది తెలియకుండా చీరలు కట్టించి వాడేశారు.
కనీసం 15 ఏళ్ళ సక్సెస్ ఫుల్ కెరీర్ ఉండాల్సిన ఆర్తి అగర్వాల్ అతికొద్ది కాలంలోనే బలవంతంగా సినిమాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు శ్రీలీల కూడా అలాగే మాస్ మహారాజ రవితేజ లాంటి సీనియర్ హీరోల సరసన సినిమాలు ఒప్పుకుంటోంది. పెళ్లి సందడి సినిమా తర్వాత యంగ్ హీరోలకి సాలీడ్ ఛాయిస్ అనుకున్నారు. కానీ, ధమాకా సినిమాలో రవితేజ సరసన నటించి షాకిచ్చింది. అసలు రవితేజ వయస్సు 54.. శ్రీలీల ఏజ్ జస్ట్ 20. అంటే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 34.
ధమాకాలో చీరకట్టి మరీ ఆమెను రకరకాల యాంగిల్స్‌లో షూట్ చేసి ఇబ్బంది పెట్టారట. అంతేకాదు, ఆయన ఏజ్‌కి శ్రీలీల మరీ చిన్న పిల్లలాగా కనిపిస్తుందనుకున్న మేకర్స్ ఏకంగా చీరకట్టించేశారు. దాంతో ఎంతో ఏజ్ ఉన్న హీరోయిన్లా కనిపించింది. అసలు రవితేజ పక్కన చీరకట్టగానే ఆమె పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నారు. ఇక ఇప్పుడు పెద్ద హీరోల పక్కన కూడా ఆమెను హీరోయిన్గా ఫిక్స్ చేస్తున్నారు.
మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్లకు కూడా జోడీగా శ్రీలీల పేరు పరిశీలనకు వచ్చింది. ఇటు అనిల్‌రావిపూడి సినిమాలో బాలయ్యకు కూతురుగా నటిస్తోంది. ఏదేమైనా ధమాకా వరకు అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది. కానీ, ఆ తర్వాత ఫ్యూచర్ ఏంటీ అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. చూడాలి మరి శ్రీలీల కెరీర్ ఎలా ఉండబోతుందో..!