అన్నగారు ఎన్‌టీఆర్ తన సినీ జీవితంలో అనేక అజరామరమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అయితే, ఆయన ప్రతి సినిమాను కూడా ఒక ప్రయోగంగానే భావించేవారు. ఎక్కడా రాజీ పడేవారు కాదు. ప్రతి సినిమాను కొత్త సినిమాలో నటిస్తున్న ప్పుడు ఎంత జాగ్రత్త తీసుకునేవారో.. అంతే జాగ్రత్త తీసుకునేవారు. ఎక్కడా కూడా ఉదాసీనంగా వ్యవహరించేవారు. తన పీఏ సహా కారు డ్రైవర్లను కూడా ఏమోయ్.. ఎలా ఉంది? అని అడిగి తెలుసుకునేవారట.
అంతేకాదు.. తన సినిమావిడుదల రోజే డ్రైవర్లు.. పీఏలకు సెలవు ఇచ్చి మరీ సినిమా చూసి రమ్మని పంపించేవారట. ఇలా ప్రతి సినిమా విషయంలోనూ అన్నగారు చాలా జాగ్రత్తగా ఉండేవారు. అయితే.. అన్నగారి సినిమాల్లో ఎన్నో హిట్లు ఉన్నప్ప టికీ.. అదేసమయంలో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఏ సినిమా హిట్టయినా.. ఆ క్రెడిట్ మొత్తాన్ని దర్శకుడు, నిర్మాతలకు ఇచ్చేసే అలవాటు అన్నగారికి ఉండేది.
ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్ టాక్ వస్తే.. మాత్రం.. `ఏదో తేడా జరిగింది. దీనికి యూనిట్ అందరూ బాధ్యులే` అని అనేవారట. ఇది.. అన్నగారి ఇమేజ్‌ను ఎంతో పెంచిందని అంటారు. సాంఘిక సినిమాల నుంచి పౌరాణిక జానపద చిత్రాల వరకు అన్నగారు ఇలానే వ్యవహరించేవారు. ఇక, అన్నగారు నటించిన లక్ష్మీకటాక్షం సినిమా ఒక హైలెట్. దీనికి ముందు వచ్చిన ఒకటి రెండు సినిమాలు ఫెయిల్ అయిపోవడంతో అన్నగారు ఒకింత నిరుత్సాహంలో ఉన్నారు.
ఆ సమయంలో వచ్చిన లక్ష్మీకటాక్షం సినిమా.. అటు జానపదంగాను.. ఇటు సాంఘికంగాను సాగుతుంది. మొత్తానికి ఈ సినిమా ఏడాది పాటు ఆడింది. అంతేకాదు.. దీనిలోని ప్రతి పాటా హిట్టయింది. రెండు పరాజయాల తర్వాత హిట్ కొట్టిన ఈ సినిమా అంటే.. అన్నగారు ఎంతో ఇష్టపడేవారట. ఈ సినిమాను చాలా కాలం మెచ్చుకున్నారు. దర్శకుడు, నిర్మాతలు ఎంతో ధైర్యంగా ఈ సినిమా తీశారని కూడా చెప్పుకొనేవారట. ఇదీ.. సంగతి..!