టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కన్నడ బ్యూటీ సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. మహానటి సావిత్రి గారి లాంటి తర్వాత అలాంటి క్రేజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక హీరోయిన్ సౌందర్య అనే చెప్పాలి . ఎక్స్పోజింగ్ కి ఆమడ దూరంలో ఉండే సౌందర్య అన్ని రకాల పాత్రలో కనిపించి.. నటించి ..మెప్పించింది. అంతేకాదు స్టార్ హీరోయిన్ గా ఉండే టైంలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా సౌందర్య నటించి జనాలను మెప్పించడం ఇక్కడ చెప్పుకో తగ్గ విషయం.
కాగా సౌందర్య అంటే గిట్టని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆమె గుమ్రించి నెగిటీవ్ కామెంట్స్ చేసే జనాలే లేరు. ఆమెలోని మంచితనం ఆమె లేకపోయినా ఇప్పటికీ జనాలు చెప్పుకుంటున్నారు అంటే అదే కారణం . అయితే పైకి ఎంతో మంచిగా సాఫ్ట్ గా కనిపించే సౌందర్య .. తన కోపం వస్తే మాత్రం భయంకరంగా మారిపోతుందని.. అప్పట్లో జనాలు చెప్పుకునే వాళ్ళు . అంతేకాదు సినిమా షూటింగ్స్ లో కూడా చాలా ఓర్పుగా సహనంగా ఉండే సౌందర్య తనకి నచ్చని పనులు చేస్తే మాత్రం సెకండ్స్ లోనే కోపం పీక్స్ కి వెళ్లిపోతుందట.
అంతేకాదు షూటింగ్ స్పాట్ నుంచి కూడా వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయని .. అప్పటి జనాలు చెప్పుకొచ్చారు . అంతేకాదు కోపం వస్తే సౌందర్యతో ఎవరు మాట్లాడకుండా ఉండడమే బెటర్ అని .. ఆమెకు కోపమే మైనస్ అయిందని ..ఆ కారణంగానే ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పిన సౌందర్య ప్రేమించి పెళ్లి చేసుకుని తలనొప్పులు క్రియేట్ చేసుకుందని ఇప్పటికి జనాలు చెప్పుకుంటూ ఉంటారు..!!